రైతు కన్నీరు:ఖరీఫ్ ధాన్యం పోకపాయే.. యాసంగి దగ్గరకొచ్చే..!

MOHAN BABU
యాసంగి వరి వేయొద్దని ప్రభుత్వం చేసిన ప్రకటన రైతులను అయోమయానికి గురి చేస్తోంది. ప్రస్తుతం ఖరీఫ్లో వేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే చాలా స్లోగా సాగుతున్నాయి. ఈ క్రమంలో యాసంగి పంట సాగుపై సర్కార్ రైతులను గందరగోళానికి గురి చేస్తోందని, వరి పంట వేయొద్దని ప్రత్యామ్నాయ పంటలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని చెబుతోంది. కానీ రైతులకు ప్రత్యామ్నాయ పంటలు అంటే ఏ పంటలు వేసుకోవాలో తెలియడం లేదు. కనీసం వాటి గురించి అవగాహన కల్పించడం లేదు ప్రభుత్వ అధికారులు. దీంతో అయోమయంలో రైతులు ఉండటంతో  వారి యొక్క పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో రైతులు పాత పంటల అనేది వేయడం లేదు.

 కొంతమంది పంట కోసుకొని సిద్ధంగా ఉంచిన కొనుగోలు చేయకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఖరీఫ్ ధాన్యం అమ్ముడుపోతే గాని యాసంగి పంట సాగు చేసే పరిస్థితి లేదని అంటున్నారు. ఈ సందర్భంలోనే యాసంగి సాగు ఆలస్యమైతే కత్తెర పంటను కోల్పోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి {{RelevantDataTitle}}