
పిల్లలపై ఒమిక్రాన్ ప్రభావం ఎలా ఉంటుంది?
ఎలా తమ పిల్లల్ని ఈ మహమ్మారి నుండి రక్షించుకోవడం అని కంగారు పడుతున్నారు. అందులోనూ ఓమిక్రాన్ మిగిలిన వెరియంట్ల కన్నా చాలా ప్రమాదమని, అలాగే వేగంగా వ్యాప్తి చెందుతుంది అని వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉండడంతో మరింత భయపడుతున్నారు. అయితే పలువురు వైద్యులు ఈ విషయం గురించి ఏం చెబుతున్నారు అంటే, ఇది చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అని ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేము, అలాగని అశ్రద్ద పనికిరాదు. కరోనా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. మీ చిన్నారులకు మాస్క్ లు ధరించడం, సోషల్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేయడం వంటి వైరస్ నిబంధనల పట్ల అవగాహన ఎక్కువ పెంచండి.
అలాగే పెద్దల కన్నా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, పౌష్ఠిక ఆహారం అందిస్తూ జాగ్రత్తలు పాటించడం మన తక్షణ కర్తవ్యం అని చెబుతున్నారు. ఇక ఈ ఓమిక్రాన్ గురించి క్లారిటీ వచ్చేందుకు ఇంకొద్ది రోజులు అధ్యయంనం అవసరమని అప్పుడే దీని ప్రభావం ఎవరిపై ఎలా ఉంటుంది. నివారణ చర్యలు వంటి వాటిపై స్పష్టత ఇవ్వగలమని అంటున్నారు.