హైదరాబాదోళ్లు డేరింగ్లోనే కాదు డేటింగ్లోనూ టాపే..!
అయితే ఇప్పుడు హైదరాబాద్ ప్రజలు డేరింగ్ లో మాత్రమే కాకుండా డేటింగ్ లో కూడా టాప్ ప్లేస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా జరిగిన ఒక సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఆన్లైన్ డేటింగ్ ప్లాట్ఫామ్ టిండర్ నిర్వహించిన ఇయర్ ఇన్ స్వైప్–2021 సర్వేలో హైదరాబాద్ డేటింగ్ పరంగా ఫస్ట్ ప్లేసులో ఉంది. ఈ ప్లేసులో హైదరాబాద్ కంటే సాఫ్ట్ వేర్ రంగంలో ముందున్న చెన్నై - బెంగళూరు - పుణే నగరాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
ఇక ఇప్పుడు హైదరాబాద్ లో న్యూడ్ వీడియో కాల్ సంస్కృతి బాగా విస్తరిస్తోందట. టీనేజర్లు నగ్నం కాల్స్ చేసుకునేందుకే ఎక్కువుగా ఇష్టపడుతున్నారట. ఇక ఇదో వ్యాపారంగా కూడా మారిపోయింది. ఈ నగరంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇప్పుడు డేటింగ్ లో మునిగి తేలుతున్నారట. డేటింగ్ యాప్ లను ఎక్కువుగా వాడుతున్న భారతీయ నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. తాజా సర్వేలో 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు కలిగిన వారి నుంచి సేకరించిన సమాచారంలో కరోనా తర్వాత ఈ డేటింగ్ యాప్ల ద్వారా ఎక్కువుగా కలుసుకుంటోన్నారట.
ఏదేమైనా ఆన్ లైన్ వాడకం పెరిగాక ఈ డేటింగ్ల సంస్కృతి బాగా పెరిగిపోయింది. ఏదేమైనా హైదరాబాద్ ఈ రంగంలో ముందుండడం కాస్త ఆందోళన కలిగించే విషయమే అని చెప్పాలి.