వామ్మో.. విదేశాల నుంచి ఏపీకి 12,500 మంది?
ఇక రెండవ దశ కరోనా వైరస్ కారణంగా అల్లాడిపోయిన భారత్‌లో మళ్లీ కఠిన ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ముఖ్యంగా ఎయిర్‌పోర్టులో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల కఠిన ఆంక్షలు విధించాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. విదేశాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా ఎయిర్‌పోర్టులో పరీక్షలు నిర్వహించుకోవాలని నెగటివ్ వస్తే నే ఎయిర్పోర్ట్ బయటికి వెళ్ళాలి అంటూ ఆంక్షలు విధించారు. ఈ సమయంలో విదేశీ ప్రయాణికులు వస్తున్నాడు అంటేనే భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. విదేశాల నుంచి ఏపీకి వచ్చిన కొంతమంది ప్రయాణికులు ఆచూకీ దొరకలేదని ఇటీవలే కొన్ని వార్తలు గా మారిపోయాయి.
ఇకపోతే డిసెంబర్ ఒకటవ తేది నుంచి విదేశాల నుంచి ఏపీ అడ్రస్ తో ఇప్పటివరకు ఏకంగా 12 వేల ఐదు వందల మంది భారత్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో అత్యధికంగా విశాఖ జిల్లాకు 1700 మంది వచ్చారట. ఆంధ్రప్రదేశ్ అడ్రస్ తో వచ్చిన పన్నెండు వేల ఐదు వందల మందిలో తొమ్మిది వేల మంది అడ్రస్‌లను అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. అయితే మిగతా వారి నుంచి మాత్రం స్పందన లేకపోవడం గమనార్హం. ఫోన్ స్విచాఫ్ చేయడంతో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలను సేకరించ లేకపోతున్నారు అధికారులు. ఇలా వివరాలు సేకరించిన వారిలో ఇద్దరికీ పాజిటివ్‌గా తేలగా మరికొంతమందిని అటు జినోమ్ సెక్వెన్సింగ్ కోసం పంపారు.