అగ్రదేశాల ముందు చూపు.. చిన్న దేశాలకు శాపమే : డబ్ల్యూహెచ్ఓ
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓమిక్రాన్ వైరస్ కారణంగా మళ్లీ విపత్కర పరిస్థితులు రాకుండా ఉండేందుకు ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తున్నాయి అగ్రరాజ్యాలు. అదే సమయంలో ఇక బూస్టర్ డోసు కూడా అవసరమని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. ఇక బూస్టర్ డోసు అవసరం అనే ఉద్దేశంతో భారీగా టీకాలను నిల్వలు చేస్తూ ఉండటం గమనార్హం.. అగ్రరాజ్యాల ముందు చూపు కాస్త ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరతను ఏర్పరుస్తుంది. అగ్రరాజ్యాల ముందు చూపు చిన్న దేశాల కు శాపంగా మారిపోతుంది. ఇక ఇటీవల ఇదే విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ చీఫ్ ఓబ్రియాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
బూస్టర్ డోస్ వేసుకోవడం వల్ల కొత్త వేరియంట్‌ను ఓమిక్రాన్ నుంచి రక్షణ పొందగలమా లేదా అనే విషయంపై పై ఎలాంటి స్పష్టత లేదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అగ్రదేశాలు టీకాలను భారీగా నిల్వ చేసుకోవడం సరైనది కాదు అంటూ వ్యాఖ్యానించారు. ఇలా భారీగా టీకా నిల్వలను పెంచుకుంటూ ఉండటం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఉన్న వ్యాక్సిన్ అసమానత మరింత పెరిగే అవకాశం ఉంది అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆరోగ్య సిబ్బంది సహా అధిక ముప్పు ఉన్న ప్రజలకు కనీసం ఒక డోసు కూడా అందించని దేశాలు ఇప్పటికీ చాలానే ఉన్నాయి అంటూ అయన వ్యాఖ్యానించారు.