జ‌గ‌న్ సొంత పార్టీ నేత‌ల‌కు బిగ్ షాక్ ఇస్తున్నారా ?

VUYYURU SUBHASH
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తమ సొంత పార్టీ నేతలకే పెద్దపెద్ద షాకులు ఇస్తున్నారు. జగన్ ఎప్పుడు ఎవరికి ఎలాంటి షాక్ ఇస్తారో కూడా ఎవరు ఊహించడం లేదు. అసలు జగన్ ఆలోచనలు కూడా పార్టీ నేతలకే అంతుపట్టడం లేదు. జగన్ గత ఎన్నికల ప్రచారంలో గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసి... తన క్యాబినెట్ లో తన పక్కన కూర్చోబెట్టి ఉంటానని హామీ ఇచ్చారు. అలాంటి నేతకు ఇప్పటివరకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు.

ఇక గత ఎన్నికల ప్రచారం లోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కి సైతం మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. ఆర్కేను కూడా ఇప్పుడు పట్టించుకోవడం లేదు. పార్టీలో చాలామంది కీలక నేతలకు సైతం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఉంది. మరోవైపు గత ఎన్నికల ప్రచారంలోనూ ఆ తర్వాత చాలామంది సీనియర్ నేతలకు సైతం మంత్రి పదవి ఇస్తానని జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. అయితే ఇప్పుడు సదరు నేతలు జగన్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా... వారిని కలిసేందుకు కూడా జగన్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

రాజకీయంగా ఎంతో అనుభవం ఉండి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ సీనియర్ నేతలను కాదని... గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత చాలా మంది జూనియర్ నేతలకు జగన్ మంత్రి పదవులు కట్టబెట్టారు. అప్పట్లో సోషల్ ఇంజనీరింగ్ పేరుతో అసలు ముక్కు మొహం తెలియని వారిని కూడా జగన్ మంత్రులను చేశారు. అప్పట్నుంచి సీనియర్లు మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు.

రెండున్నర సంవత్సరాల తర్వాత క్యాబినెట్ ను మారుస్తానని జగన్ చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు రెండు సంవత్సరాలు కూడా దాటిపోవడంతో వీరంతా కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడటం తప్ప... జగన్‌ను అడిగే సాహసం చేయలేకపోతున్నారు. ఇంకా చెప్పాలి అంటే ఎంత కొమ్ములు తిరిగిన నేతలకు అయినా జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు. దీంతో వారు తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక లబోదిబోమంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: