ఇండియాకు షాకిచ్చిన టర్కీ.. భారీ డిస్కౌంట్ తో బేరం?
ఇలా ఇప్పటివరకు మేకిన్ ఇండియా లో భాగంగా ఎన్నో రకాల క్షిపణులను తయారు చేసింది భారత రక్షణరంగ పరిశోధనా సంస్థ. అంతే కాదు యుద్ధ విమానాలను కూడా తయారు చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డి ఆర్ డి ఓ మేకిన్ ఇండియా లో భాగంగా లైట్ వెయిట్ యుద్ధ విమానం తేజస్ యుద్ధ విమానాన్ని తయారు చేసింది. యుద్ధ విమానాలను ఇతర దేశాలకు విక్రయించేందుకు కూడా సిద్ధమైంది. ఇప్పటికే పలు దేశాలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే లైట్ వెయిట్ యుద్ధ విమానం గా పేరున్న తేజస్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం మలేషియా భారత్తో చర్చలు జరుపుతోంది.
కానీ ఇలాంటి సమయంలోనే మలేషియా దృష్టిని ఆకర్షించేందుకు సిద్ధమైంది టర్కీ. ప్రస్తుతం టర్కీ రోజురోజుకు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు యుద్ధ విమానాలను విక్రయించడమే పనిగా పెట్టుకుంది. దీనికోసం విక్రయాలలో భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. దీంతో ఇక భారత్కు చెందిన తేజస్ యుద్ధ విమానాల కంటే చౌకగా తమ యుద్ధ విమానాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ ఇటీవల మలేషియా తో టర్కీ చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టర్కీకి చెందిన హజ్రత్ విమానాన్ని బేరానికి పెట్టింది. మరి మలేషియా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.