టీకా వేసుకోవటం లేదని.. అక్కడే దుకాణం పెట్టిన అధికారులు?

praveen
కరోనా వైరస్ పై పోరాటానికి ప్రస్తుతం వ్యాక్సిన్ వేసుకోవడం అనేది తప్పనిసరి గా మారి పోయింది. వ్యాక్సిన్ వేసుకుని ఇక శరీరం లో యాంటీ బాడీ లను అభివృద్ధి చేసుకుంటే ఇక కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ గా ఉండదు అని పరి శోధకులు చెబుతున్నారు. ఈ క్రమం లోనే కొన్ని వ్యాక్సిన్లను అత్య వసర వినియోగం లోకి తీసుకు రాగా మొదట్లో ఈ వ్యాక్సిన్ లపై అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చేసింది. దీంతో వ్యాక్సిన్ వేసుకో వడానికి స్వచ్ఛందం గా ముందుకు వస్తున్నారు.


 అదే సమయం లో ప్రభుత్వ అధి కారులు సైతం ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సిన్ వేస్తూన్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. అయితే వ్యాక్సిన్ విషయం లో ఇప్పటికీ భయాందోళన కు గురవుతున్న ఎంతో మందికి బలవంతం గా వైద్యా ధికారులు టీకాలు వేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారి పోతున్నాయి. అయితే వ్యాక్సిన్ వేసు కోవడానికి ఇప్పటికి కూడా ఎంతో మంది భయపడి పోతున్న నేపథ్యం లో అధికారులు కూడా వినూత్నమైన ఆలోచన చేస్తూ టీకా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు.



 ఇక ఇటీవలే గుజరాత్లోని అహ్మదా బాద్ మున్సిపల్ కార్పొ రేషన్ అధి కారులు చేసిన ఆలోచన అయితే అందరిని అవాక్కయ్యేలా చేస్తోంది. ఎట్టి పరిస్థితు ల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలనే లక్ష్యం  తో ఎంతో వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా అహ్మదా బాద్ నగరంలో జరుగుతున్న పెళ్ళిళ్ళు ఇతర వేడుకలకు టీకాలు తీసుకుని వెళ్ళు తున్నారు అధికారులు. అక్కడ ఉన్న బంధువులు అందరి వ్యాక్సిన్ సర్టిఫికెట్లను పరిశీలి స్తున్నారు. ఇలా వ్యాక్సిన్ వేసు కోకుండా ఉన్న వారికి ఇక అక్కడే టీకా చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: