ఏపీ సర్కార్ ఇమేజ్‌కు భారీ డ్యామేజ్ ?
ఇదిలా ఉంటే తాజాగా రాజ్యసభలో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పెద్ద షాక్ ఇచ్చే మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పిన ఆయన తాము పలు ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేస్తున్నాయని... అయితే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి సమర్థవంతమైన చర్యలు తీసుకున్నప్పుడే వాటిని మేం అమలులోకి తీసుకు రాగలం అని ఆయన చెప్పారు.
భూ సేకరణ తో పాటు ఆ భూమి అంతా ఒకే చోట ఉండేలా చూసినప్పుడే... అక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. కృష్ణపట్నం రోడ్డు డెవలప్మెంట్ కోసం రాష్ట్రం తలపెట్టిన టెండరింగ్ విధానంపై కూడా చాలామంది కాంట్రాక్టర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయాన్ని కూడా ఆయన చెప్పారు.
ఇక కాంట్రాక్టర్ల విషయంలో కూడా ఉత్తమ టెండరింగ్ ప్రక్రియ అనుసరించాల్సి ఉంది అని... ఇప్పుడు ఏపీ లో ఉన్న టెండరింగ్ ప్రక్రియ విధానం పై కూడా చాలామంది కాంట్రాక్టర్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పారు. తాము ఎంతో అభివృద్ధి చేసినా... రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోతే అది ముందుకు జరగదని చెప్పారు. ఏదేమైనా గోయల్ మాటలు చూస్తే తాము ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా కూడా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు.