వామ్మో రేవంతూ: కేసీఆర్ కు డీఎన్ఏ పరీక్ష చేయాలంటా..!

MOHAN BABU
 రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆ పార్టీ క్యాడర్ లో కొంత ఉత్సాహం పెరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎప్పుడు ఎదో ఒక విధంగా సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు.  ప్రతిపక్ష హోదాలో ఉంటూ అటు కాంగ్రెస్ పార్టీని నడిపిస్తూ, మూడు సభలు,నాలుగు సమావేశాలు అంటూ తిరుగుతూ, అసమ్మతి నేతలను కలుస్తూ తనదైన శైలిలో రాజకీయం చేస్తూ, తెలంగాణ కాంగ్రెస్ లో మరొక నూతన ఒరవడిని సృష్టిస్తున్నారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అలా ఎప్పుడు కెసిఆర్ అంటే గిట్టని  రేవంత్ రెడ్డి ఈరోజు మరో సంచలనమైన వ్యాఖ్య కెసిఆర్ పై చేశారు. అది ఏంటో తెలుసుకుందామా..?


 అమరుల స్తూపం కట్టడానికి తెలంగాణ వాళ్ళు పనికిరారా అని తెలంగాణ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగారు. అమరుల స్తూపం కట్టడానికి  తెలంగాణ కాంట్రాక్టర్లు పనికిరారా అని, ఆంధ్ర కాంట్రాక్టర్కు ఇచ్చి అమరుల గుండెల్లో గునపాలు దింపారని, కాంట్రాక్టర్లిచ్చే కమీషన్ల కోసమే అమరుల స్తూపం నిర్మాణం ఆంధ్ర కాంట్రాక్టరులకు అప్పజెప్పాలని తెలియజేశారు. అసలు నాలుగేళ్లైనా అమరుల స్తూపం ఎందుకు పూర్తి కాలేదో విచారణ కమిటీ వేయాలని  తెలియజేశారు. ఆ కమిటీని వేసి ఆలస్యానికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నువ్వు అసలైన తెలంగాణ బిడ్డ అయితే ఇంత లేట్ అయి ఉండేది కాదని, నీకు డీఎన్ఏ పరీక్ష చేయించాలని, అసలు నీకు తెలంగాణ రక్తం ఉందా అని తీవ్రమైన వ్యాఖ్యలతో ఖండించారు. నువ్వు  తెలంగాణ లో పుట్టిన బిడ్డ అయితే తప్పనిసరిగా డిఎన్ఎ పరీక్షకు సిద్ధం కావాలని తెలిపారు. తెలంగాణ ప్రజల తెలంగాణ అమరవీరుల ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం అమరవీరుల స్థూపం అని అన్నారు. అలాంటి స్తుపాన్ని ఇంతవరకు నిర్మించక పోవడం చాలా బాధాకరమని  అన్నారు. ఈ విధంగా రేవంత్ రెడ్డి కెసిఆర్  ను టార్గెట్ గా చేసి మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: