బూస్టర్ డోస్ వేసుకున్న వదలని ఓమిక్రాన్.. అంతా భయం భయం?
ముఖ్యంగా అగ్రరాజ్యమైన అమెరికా లో అయితే పగబట్టినట్లుగానే వ్యవహరిస్తుంది కరోనా వైరస్. అగ్రరాజ్యంలో ప్రపంచ స్థాయి అత్యున్నత వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.ఎంతోమంది అద్భుతమైన డాక్టర్లు కూడా ఉన్నారు. కానీ అత్యధిక మంది అగ్రరాజ్యం లోనే కరోనా వైరస్‌కు బలైపోయారు. అయితే మొన్నటి వరకూ అమెరికా లో వైరస్ కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినప్పటికీ గత కొన్ని రోజుల నుంచి మాత్రం వైరస్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇక ప్రస్తుతం అగ్రరాజ్యమైన అమెరికా లో ప్రతిరోజు వెలుగులోకి వస్తున్న కేసుల సంఖ్య దాదాపు లక్ష వరకు ఉంది అని చెప్పాలి.
అయితే ఇప్పటికే పెరిగిపోతున్న కేసులతో అగ్రరాజ్య ప్రజానీకం మొత్తం అయోమయంలో మునిగి పోతున్న సమయంలో.. ఇక ఇప్పుడు ఓమిక్రాన్ వైరస్ కేసులు కూడా పెరిగి పోతూ ఉండటం అందరినీ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటివరకు ఈ కొత్త వేరియంట్ అమెరికాలోని ఇరవై రెండు రాష్ట్రాలకు వ్యాప్తి చెందినట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. కాగా ఇప్పటివరకు అమెరికాలో 43 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇలా కొత్త వేరియంట్ బారినపడిన వారిలో వ్యాక్సినేషన్ పూర్తయిన వారు 34మంది ఇక వీరిలో బూస్టర్ డోస్ వేసుకున్న 14 మంది కూడా వైరస్ బారిన పడటం గమనార్హం.