హ్యాపీ సండే : శభాష్ రైతన్నా! ఈ వారం మీదే ఈ కాలం మీదే!
దేశంలోనూ, రాష్ట్రంలోనూ రైతులే ప్రాధానంగా మీడియాకు గుర్తుకు వచ్చారు. ఎముకలు కొరికే చలిలో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేసిన పోరాటం విజవంతమైంది. ఎవరికీ తల వంచని ప్రధాన మంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోడీ తన పాలనా హయాంలో తొలి సారి రైతులకు తలవంచారు. రెండడుగులు వెనక్కి తగ్గారు. తాను తీసుకు వచ్చాన రైతు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు యావత్ భారత దేశం నివ్వెర పోయీంది. మోడీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నరని ఒకవర్గం పేర్కోనగా, రైతుల పోరాటం ఫలించిందని మరో వర్గం పేర్కోంది. ఉత్తర భారతంలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోడీ కొంత వెనక్కి తగ్గారని ప్రసార మాధ్యమాలు తమ చర్చల్లో పేర్కోన్నాయి. ఏది ఏమైనా రైతు చట్టాలపై విజయం మాత్రం రైతుల పోరాట ఫలితమే. దీంతో రైతులు ఢిల్లీ శివార్లను ఖాలీ చేసేందుకు ఉపక్రమించారు. రైతులకు మద్దతుదా నిలిచిన వారు ఆకాశం నుంచి హెలికాఫర్ తో వీరికి పూలాభిషేకం చేశారు.
ఇక ఆంధ్ర ప్రదేశ్ లోనూ రైతులే మీడియాకు హాట్ టాపిక్. న్యాయస్థానం నుంచి దేవస్థానం యాత్ర చేస్తున్న అమరావతి రైతులు తమ గమ్యస్థానం చేరుకునేందుకు కొద్ది దూరం లోనే ఉన్నారు. వారు చేపట్టిన తిరుమల యాత్ర చిత్తూరు జిల్లాకు చేరుకుంది. అడుగడుగునా తెలుగుదేశం పార్టీ శ్రేణలు తమ పార్టీ జెండాలను మడిచి పెట్టి, ఇంకా చెప్పాలంటే దాచి పెట్టి బహిరంగంగా అమరావతి రైతుల యాత్రలో పాల్గోంటున్నారు. పసుపు కండువాలు పక్కన పెట్టి ఆకుపచ్చ కండువాలు కప్పుకున్నారు. రైతులకు మద్దతుగా యాత్రలో పాల్గోన్నారు. వీరు తిరపతిలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అదే విధంగా వారు తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శనం కల్పించమని వారి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి విజ్ఞప్తి చేశారు. ఈ రెెండు కోరికలు కూడా ఇంకా పెండింగ్ లోఉన్నాయి.
ఇటు రాష్ట్రం లోనూ, దేశంలోనూ ఈ వారం మీడియా దృష్టిని ఆకర్షించిన ప్రముఖలు రైతులే కావడం విశేషం.