హ్యాపీ సండే 12-DEC: కేసీఆర్‌కు 18 మార్కులే.. తాజా స‌ర్వే సంచ‌ల‌నం..!

N ANJANEYULU
తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల‌లో రోజు రోజుకు కీల‌క మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా రెండు సంవ‌త్స‌రాల పాటు స‌మ‌యం ఉన్నా.. అప్పుడే ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది. కేసీఆర్ మ‌ళ్లీ ముంద‌స్తుకు వెళ్లుతార‌నే ప్ర‌చారంతో ఎన్నిక‌లు ఎప్పుడైనా రావ‌చ్చు అనే ఉద్దేశంతో ముఖ్యంగా మూడు పార్టీలు దూకుడును పెంచుతున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో తెలంగాణ ప్ర‌జ‌ల్లో కేసీఆర్‌పై వ్య‌తిరేక‌త భారీగానే పెరిగింద‌ని చ‌ర్చ కొన‌సాగుతున్న‌ది.
తాజాగా తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయంగా జ‌నాలు ఏ పార్టీని కోరుకుంటున్నారనే అంశాల‌పై వోటా అనే సంస్థ  ఓ స‌ర్వే నిర్వ‌హించింది. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కంబాల‌ప‌ల్లి కృష్ణ ఆధ్వ‌ర్యంలో వాయిస్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రా  సంస్థ స‌మ‌గ్ర స‌ర్వే చేప‌ట్టింది. ముఖ్యంగా కేసీఆర్ రెండోసారి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి మూడు సంవ‌త్స‌రాలు పూర్త‌యిన సంద‌ర్భంగా వోటా స‌ర్వే నిర్వ‌హించింది. ఈనెల 01 నుంచి 10 వ‌ర‌కు ప‌ది రోజుల పాటు స‌ర్వే చేసి స‌మాచారం సేక‌రించింది. ఆన్‌లైన్ ద్వారానే ఎక్కువ‌గా శాంపిల్స్‌ను సేక‌రించింది వోటా.
ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే టీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోతుంద‌ని.. మూడ‌వ స్థానానికి ప‌డిపోతుంద‌ని వోటా స‌ర్వేలో వెల్ల‌డించింది. అదేవిధంగా టీఆర్ఎస్‌లో అస‌మ్మ‌తి ఖాయ‌ము అని కూడా ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేసారు. కేసీఆర్ ఏడేండ్ల ప‌రిపాల‌న ఏవిధంగా ఉంద‌ని స‌ర్వేలో అడిగిన ప్ర‌శ్న‌కు చాలా మంది దిమ్మ‌తిరిగే స‌మాధానం చెప్పారు. ప్ర‌స్తుత సీఎం ప‌రిపాల‌న‌కు కేవ‌లం 18 మార్కులే వేసారు. కేసీఆర్ పాల‌న అస‌లు బాగాలేద‌ని.. 50.8 శాతం మంది పేర్కొంటే.. 20.3 శాతం బాగాలేద‌ని, 10.9 మంది కేసీఆర్ పాల‌న ప‌ర్వాలేద‌ని పేర్కొన్నారు.
కొంత‌మందిని కేసీఆర్ పాల‌న‌కు ఎన్ని మార్కులు వేస్తార‌ని ప్ర‌శ్నించ‌గా.. ఎక్కువ శాతం 25 మార్కులే అని..  కేసీఆర్ పాల‌నా అట్ట‌ర్ ప్లాప్ అంటూ  67.1 శాతం మంది మార్కులు వేసారు.  కేసీఆర్‌పై 70 శాతం మంది వ్య‌తిరేకంగా ఉన్నారు. ద‌ళిత బంధు వేస్తారా..? అని స‌ర్వే చేస్తే 73 శాతం మంది ఇవ్వ‌రు అని వెల్ల‌డించారు. అయితే బీజేపీకి 48.5 శాతం మంది,  కాంగ్రెస్‌కు 27.1 శాతం టీఆర్ఎస్‌కు 18 శాతం మ‌ద్ద‌తు తెలిపారు.
తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే ఓటు ఎవ‌రికీ వేస్తార‌నే ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర‌మైన‌ జ‌వాబు వ‌చ్చింది. బీజేపీకీ 38.4 శాతం, కాంగ్రెస్‌కు 37 శాతం మంది, టీఆర్ఎస్‌కు కేవ‌లం 22.2 మంది మాత్ర‌మే ఓటు వేస్తామ‌ని చెప్పారు. ఎవ‌రికీ ఓటు వేస్తార‌నే ప్ర‌శ్న‌కు మాత్రం కాంగ్రెస్‌, బీజేపీ హోరాహోరీగా నిల‌వ‌డం ఇప్పుడు ఎంతో ఆస‌క్తికేపుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: