వామ్మో.. ఈమె వెరీ నాటు.. కూతురు పేరుతో కాలేజీలో చేరి?
ఇక్కడ ఓ తల్లి చేసిన పని తెలిస్తే అందరూ షాక్ అవుతున్నారు అని చెప్పాలి. సాధారణంగా ఏ తల్లి అయినా సరే కూతురుని కాలేజీ కి పంపించి ఇక బాగా చదువుకోవాలి అని చెబుతూ ఉంటుంది. అంతేకాదు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అంటూ సూచిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునే తల్లి మాత్రం తన కూతురికి మంచి చెడులు చెప్పిందో లేదో తెలియదు కానీ.. ఇక ఆ తల్లి చేసిన పని మాత్రం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. కూతురికి మంచి చెడులు చెప్పి కాలేజీకి పంపించాల్సిన తల్లి కూతురు పేరుతో కాలేజీకి వెళ్ళడం మొదలు పెట్టింది.
అయ్యో పాపం ఆమెకి చదువుపై ఆసక్తి ఉందేమో అందుకే కూతురు పేరుతో కాలేజీ కి వెళుతుంది ఏమో అని అనుకుంటున్నారు కదా. అలా అనుకున్నారు అంటే మాత్రం తప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే ఆమె కాలేజీకి వెళ్ళింది చదువు మీద ఆసక్తి తో కాదు అబ్బాయిల మీద ఇంట్రెస్ట్ తో. అమెరికాకు చెందిన లారా అనే 48 ఏళ్ల మహిళ గత కొంత కాలం నుంచి 22 ఏళ్ళ కుమార్తె తో విడిపోయింది. అయితే కూతురు పేరు మీద సామాజిక భద్రతా కార్డు కోసం దరఖాస్తు చేసి ఏకంగా 25 వేల డాలర్లకు పైగా దక్కించుకుంది సదరు మహిళ. అంతేకాదండోయ్ ఇక కూతురు పేరుతో కాలేజీకి వెళ్లడం కూడా మొదలు పెట్టింది.కూతురు పేరు పైన స్టూడెంట్ లోన్స్ సైతం తీసుకుంది. ఇంతటితో ఆగలేదు ఏకంగా కాలేజీలో ఉన్న అబ్బాయిలతో డేటింగ్ చేయడం మొదలు పెట్టింది. చివరికి ఈ వ్యవహారం మొత్తం బయట పడడంతో ఇక నిజం ఒప్పుకోక తప్పలేదు.