కేసీఆర్ తమిళనాడు పర్యటన.. వ్యూహం ఇదేనా..!

MOHAN BABU
కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఎవరికీ అంతు చిక్కకుండా ఉంటాయి. గత ఎన్నికల ముందే జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలని కెసిఆర్ భావించినా అది సాధ్యపడలేదు. మరోసారి అలాంటి ప్రయత్నం కెసిఆర్ చేసే ఛాన్స్  ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తమిళనాడు పర్యటన ఆసక్తిక రంగా మారింది. రెండు రోజుల పాటు సీఎం కేసీఆర్ తమిళనాడు టూర్ సాగనుంది. మంగళవారం రోజు తమిళ నాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ తో కేసీఆర్ సమావేశం కాను న్నారు. కేంద్ర సర్కారుతో కెసిఆర్ యుద్ధాన్ని ప్రకటించడం జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును మళ్లీ ముమ్మ రం చేస్తారన్న ప్రకటన తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ సీఎం తమిళనాడు పర్యటనకు ప్రాధాన్యం పెరిగింది.


తమిళనాడు పర్యటనలో తొలిరోజు మొత్తం ఆధ్యాత్మికతకు కేటాయించినున్న సీఎం కేసీఆర్,రెండో రోజు మాత్రం రాజకీయాల పై ఫోకస్ పెట్టను న్నారు.  తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం ఉదయం తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ తో భేటీ అవుతారని సమాచారం. కేంద్రంపై ఇద్దరు సీఎంలు ధిక్కార స్వరం వినిపిస్తుండడం దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే  క్రమంలో  పరస్పర సహకారం, ప్రాంతీయ పార్టీల ఐక్యత తదితర అంశాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకోబోతున్నట్లు  సమాచారం. టాలెంట్ సమక్షంలోని డీఎంకే పార్టీ సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ తో స్నేహం  కొనసాగిస్తూ యూపీఏ లో ప్రధాన భాగస్వామిగా ఉంది. కెసిఆర్ మాత్రం కాంగ్రెసేతర, బిజెపేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని చెబుతున్నారు. ఆ దిశగా ఇద్దరి మధ్యలో చర్చలు జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా దేశ రాజకీయాల్లో  ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి రాజకీయాన్ని మార్చాలని దీనికోసమే కెసిఆర్ కూడా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరుపుతున్నారని రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో ఆయన ప్రత్యేకత చాట నున్నారని ఈ తతంగమంతా చూస్తే తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: