కారు రివర్స్: గులాబీ తోటలో ఆ సంబరం ఏది?

M N Amaleswara rao
తెలంగాణ రాజకీయాల్లో సరిగ్గా మూడేళ్లు వెనక్కి వెళితే...ఒక రాజకీయ చాణక్యుడి అద్భుతమైన వ్యూహం గుర్తొస్తుందనే చెప్పాలి. రాజకీయ ప్రత్యర్ధులందరూ ఏకమైన సరే వన్ మ్యాన్ ఆర్మీ మాదిరిగా బరిలో దిగి వారిని చిత్తు చేశారు. అసలు ఊహించని ఎత్తుగడలతో ప్రత్యర్ధులకు చెక్ పెట్టి రెండోసారి తెలంగాణ గడ్డపై అధికారంలోకి వచ్చారు. ఇక మాటల బట్టి చూస్తే..ఆ వన్ మ్యాన్ ఆర్మీ ఎవరో ఈ పాటికి అందరికీ అర్ధమయ్యే ఉంటుందనే చెప్పాలి. అందరూ అనుకున్నట్లే తన పదునైన వ్యూహాలతో ప్రత్యర్ధులని చిత్తు చేసిన నేత కేసీఆర్.

అనూహ్యంగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళి...కేసీఆర్ ప్రత్యర్ధులకు చెక్ పెట్టారు. మామూలుగా ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉండగానే..కేసీఆర్..తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అయితే ముందస్తులో కేసీఆర్ దెబ్బతినడం ఖాయమని అంతా అనుకున్నారు. పైగా ప్రతిపక్షాలు ఏకమైపోయాయి. ఎప్పుడూలేని విధంగా కాంగ్రెస్-టీడీపీలు కలిశాయి. చంద్రబాబు ప్రత్యేకంగా కేసీఆర్‌ని ఓడించడాలని ప్రచారం చేశారు. కానీ ప్రతిపక్షాలు ఎన్ని వ్యూహాలు వేసినా...అవన్నీ ఫెయిల్ అయ్యాయి...కేసీఆర్ వన్ మ్యాన్ ఆర్మీ మాదిరిగా...తన పార్టీని మళ్ళీ గెలిపించుకున్నారు.


గతం కంటే ఎక్కువ సీట్లు దక్కించుకుని రెండోసారి అధికారంలోకి వచ్చారు. కరెక్ట్‌గా మూడేళ్ళ క్రితం అంటే...డిసెంబర్ 7, 2018లో ఎన్నికలు జరగగా, 11న ఫలితాలు వచ్చాయి. 13న ఎన్నికల ప్రక్రియ ముగిసి...తెలంగాణలో టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చింది. అంటే సరిగ్గా మూడేళ్ళ కిందట ఇదంతా జరిగింది. అంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అయింది.

అయితే మూడేళ్ళ పాలన విషయంలో టీఆర్ఎస్‌లో ఎక్కడా జోష్ కనిపించడం లేదు. మూడేళ్ళ పాలనపై సంబరాలు జరుపుకోవడం లేదు. అసలు ఏ నేత కూడా మూడేళ్ళ పాలన గురించి మాట్లాడటం లేదు. అంటే ఇప్పుడు ప్రజల్లో అసంతృప్తి ఉందని కారు నేతలు మూడేళ్ళ పాలనపై స్పందించడం లేదని అర్ధమవుతుంది. మొత్తానికి మూడేళ్ళలో కారు కాస్త రివర్స్ అయినట్లే కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: