వామ్మో.. ఒమిక్రాన్.. రెండు డోసులు తీసుకున్నా కష్టమేనా?

Chakravarthi Kalyan
ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ గురించి అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. ఈ వేరియంట్ మరోసారి కరోనా వేవ్‌ ను తీసుకొస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించిన నేపథ్యంలో అంతా జాగ్రత్తపడుతున్నారు. ఈ ఒమిక్రాన్ వేరియంట్‌ ను కట్టడి చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు. దేన్నయినా కట్టడి చేయాలంటే ముందు దాని గురించి అన్ని విషయాలు తెలియాలి కదా. అందుకే జోరుగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల్లో అనేక షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి.

వాటిలో భయంకలిగించేదేమిటంటే.. కరోనా టీకాలు రెండు డోసులు తీసుకున్నా ఒమిక్రాన్‌ రాకుండా అవి అడ్డుకోలేవట. శరవేగంతో వ్యాపిస్తున్న ఈ ఆందోళనకరమైన వేరియంట్‌ ఒమిక్రాన్‌కు టీకా రెండు డోసులతో లభించే రక్షణ అంతంత మాత్రమేనని తాజాగా ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. కరోనా రెండు డోసులు తీసుకున్నవారిలోనూ..  ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా తక్కువ యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతున్నాయట. అంతే కాదు.. గతంలో ఇన్‌ఫెక్షన్‌ బారినపడి కోలుకున్న వారితో పాటు వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి కూడా ఈ ఒమిక్రాన్‌ తో ముప్పు పొంచే వుందట.

అసలు ఇప్పడు వాడుకలో ఉన్న వ్యాక్సీన్లు ఒమిక్రాన్‌ పై ఎంత వరకూ పని చేస్తున్నాయనే అంశంపై  యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ నిపుణులు చేసిన స్టడీలో ఈ విషయాలు వెలుగు చూశాయి. ఈ స్టడీలో భాగంగా ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న వారిపై ప్రయోగాలు జరిపారు. వారి రక్త నమూనాలను తీసుకొని పరీక్షలు నిర్వహించారు. ఈ టీకాల వల్ల పొందిన యాంటీబాడీలు ఒమిక్రాన్‌ నుంచి కొంత వరకే రక్షణ మాత్రమే ఇస్తున్నట్లు ఈ అధ్యయనంతో తేలింది. డెల్టా వేరియంట్‌ పై కాస్త బాగానే పని చేసిన ఈ టీకాలు.. ఒమిక్రాన్‌ను మాత్రం అడ్డుకోలేకపోతున్నాయట.

అయితే.. మూడో డోసు తీసుకున్న వారిలో మాత్రం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయట. అయితే ఈ అధ్యయన ఫలితాలను ఇంకా విశ్లేషించాల్సి ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఏదేమైనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ జరు చూస్తే బూస్టర్‌ డోసు తీసుకోవడం కూడా తప్పనిసరి అవుతుందేమో.. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: