వావ్.. అంతరిక్షంలో చికెన్ బిర్యాని.. ఐడియా అదిరిందిగా?

praveen
అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాముల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ విషయంలో అవగాహన లేక పోయినప్పటికీ  ఎన్నో సినిమాల కారణంగా అంతరిక్ష వ్యోమగాములు పడే ఇబ్బందులు మాత్రం చాలా మంది తెలుసుకున్నారు. జీరో గ్రావిటీ కారణంగా అటు అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు ఎప్పుడు గాల్లో తేలుతూ ఉంటారు. అయితే ఒకసారి అంతరిక్షంలోకి వెళ్లాలి అని అనుకున్నప్పుడు వారికి సరిపడ ఆహారం తీసుకెళ్ళడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే అటు ఆహార పదార్థాలు కూడా గాల్లో తేలిపోతూ ఉంటాయి.


 ఇకపోతే ఇటీవలే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా గగన్ యాన్ అనే ప్రాజెక్టు చేపట్టింది. అయితే ఈ ప్రాజెక్టులో పాల్గొనబోయే వ్యోమగాములు అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఈ క్రమంలోనే వ్యోమగాములకు అంతరిక్షంలో తినేందుకు ప్రత్యేకమైన ఆహార పదార్థాలు తయారు చేసేందుకు సిద్ధమైంది ఇస్రో. కర్ణాటకలోని మైసూర్లో డిఆర్డిఓ కి చెందిన డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లేబోరేటరీ ఇక అంతరిక్షంలో వ్యోమగాములు కోసం ప్రత్యేకమైన ఆహారాన్ని తయారు చేస్తుంది.


 ఇకపోతే ఇటీవలే డిఫెన్స్  ఫుడ్ రీసెర్చ్ లేబరేటరీ శాస్త్రవేత్త ఒకరు మీడియాతో మాట్లాడి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. భూమి మీద కూర్చొని నిలబడి తినేందుకు అవకాశం ఉంటుంది. అంతరిక్షంలో జీరో గ్రావిటీ కారణంగా ఇక్కడ భూమ్మీద తినే చపాతీలు కూరలు అన్ని కూడా గాల్లో తేలిపోతు ఉంటాయి. అందుకే అంతరిక్షం లోకి వెళ్లే వ్యోమగాములు కోసం ప్రత్యేకమైన ఆహార పదార్ధాల జాబితాను సిద్ధం చేసి తయారు చేస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు. ఇలా తయారు చేస్తున్న వంటకాలలో భారతీయ వంటకాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ వంటకాల లిస్ట్ ఇలా ఉంది.
రెడీ టు ఈట్‌ :
వెజ్‌ పులావ్‌, వెజ్‌ బిర్యానీ, చికెన్‌ బిర్యానీ, చికెన్‌ కుర్మా, దాల్‌ మఖానీ, సూజి హల్వా, చికెన్‌ కట్టి రోల్‌, వెజ్‌ కట్టి రోల్‌, ఎగ్‌ కట్టి రోల్‌, స్టఫ్డ్‌ పరోటా
రెడీ టు డ్రింక్‌ :
మ్యాంగో నెక్టర్‌, పైనాపిల్‌ జ్యూస్‌, టీ, కాఫీ..

కాంబో ఫుడ్‌ :
రాజ్మా చావల్‌, సాంబార్‌ చావల్‌, దాల్‌ చావల్‌, రెడీ టు ఈట్‌ ఎనర్జీ బార్స్‌

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: