ఆరేళ్ల త‌ర్వాత బాబు బెస్ట్ ఫ్రెండ్‌కు ఇంత అదృష్ట‌మా ?

VUYYURU SUBHASH
హమ్మయ్య ఎన్నో సంవత్సరాల తర్వాత తిరిగి ఎల్.రమణ మళ్ళీ చట్టసభల‌ లోకి అడుగు పెడుతున్నారు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఎల్.రమణ కొద్ది నెలల క్రితం వరకు కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా చంద్రబాబు ఎల్.రమణ ను తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. గతంలో మంత్రిగా - కరీంనగర్ ఎంపీగా - జగిత్యాల ఎమ్మెల్యేగా విజయాలు సాధించిన ఎల్.రమణ చివరిసారిగా 2009లో జగిత్యాల ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఆతర్వాత ఆయనకు రాజకీయంగా కాలం కలిసి రాలేదు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా... ఆ పార్టీకి ఇక్కడ ఇలాంటి స్కోప్ లేక లేకపోవడంతో రమణ చట్టసభలకు వెళ్లలేకపోయారు. అయితే ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆయనకు చట్టసభల‌ లోకి అడుగు పెట్టి అదృష్టం వచ్చింది. కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రమణ ఎమ్మెల్సీ గా విజయం సాధించారు. ఇక్కడి నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన భానుప్రసాద్ రావు, రమణ ఎమ్మెల్సీలుగా గెలిచారు.

హుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందే ఎల్.రమణ ను కెసిఆర్ పార్టీలో చేర్చుకున్నారు. అయితే అక్కడ పార్టీ ఓడిపోయిన కూడా కెసిఆర్ ఇచ్చిన హామీకి కట్టుబడి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇక 2014 తర్వాత చంద్రబాబు రమణకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆయన పార్టీ మారే వరకూ కూడా తెలంగాణ టిడిపికి అధ్యక్షుడు గా కొనసాగుతూ వచ్చారు.

బీసీ నేత గా పేరున్న ఎల్.రమణ బలమైన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారు. కరీంనగర్ జిల్లాలో సామాజిక సమీకరణాల పై దృష్టి పెట్టిన కేసీఆర్ ఆ కోణంలోనే తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ నుంచి బయటికి వెళ్లిపోవడం... అదే సమయంలో ఆయన పార్టీ మారటం బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: