గూగుల్ డెడ్ లైన్ ఇచ్చేసింది... జర జాగ్రత్త
గూగుల్ ... భారతీయు మూలాలున్న సుందర్ పిచై సిఈఓ గా ఉన్న కంపెనీ ..ఎవరూ కాదన లేని నిజం ఒకటుంది. ఇది దిగ్గజ సెర్చ్ ఇంజన్.సాంకేతిక పరిజ్ఞానం అంతో ఇంతో ఉన్న వ్యక్తులు ఎక్కడో ఒక చోట.. |ఏదో ఒక సమయంలో గూగుల్ నుంచి సేవలు పొందే ఉంటారు. ఈ కంపెనీలో పనిచేయడానికి ఔత్సాహికులు ఉవ్విళ్లూరుతారు. ఆ సంస్థ తాజాగా ప్రపంచ వ్యాప్తంగా తన ఉద్యోగులకు ఒక హెచ్చరిక జారీ చేసింది. నిబంధనలు పాటించకుంటే ఉద్యోగం ఊడుతుందని స్పష్టంగా చెప్పింది. ఎన్నడూ లేనిది ఏమిటా నిబంధనలు ? ఎందుకా డెడ్ లైన్ ?
ప్రపంచంలో ఏ మూల గూగుల్ కంపెనీ కోసం పని చేస్తున్న ఉద్యోగులైనా సరే కోవిడ్-19 నిబంధనలు పాటించాలని గూగుల్ కంపెనీ పేర్కోంది. ఈ మేరకు తన సిబ్బందికి అదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా సంస్థ సిఎన్ బిసి పేర్కోన్నట్లు భారత్ కేంద్రంగా నడిచే ఇండియా టుడే వార్తా సంస్థ తన కథనంలో పేర్కోంది.
గూగుల్ సిబ్బందిలో ప్రతిఒక్కరూ కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టే వ్యాక్సిన్ వేసుకోవాలని అదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ వేసుకున్న తరువాత ఇందుకు సంబంధించిన ధృవపత్రాలను కంపెనీకి అందించాలని సూచించింది. గతంలో నే ఇలంటి ఆదేశాలు జారీ చేసింది. అప్పడు గడువు డిసెంబర్ 3వ తేదీగా పేర్కోంది. అయితే ఉద్యోగులు పూర్తిస్థాయిలో టీకా వేయించుకోక పోవడంతో చాలా మంది ఉద్యోగులు తాము టీకా వేసుకునేందుకు ఎదురవుతున్న ఇబ్బందులను ఏకరవు పెడుతూ కంపెనీకి మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. కుప్పలు తెప్పలుగా ఉద్యోగుల నుంచి మెయిల్స్ రావడంతో గూగుల్ కంపెనీ ఉద్యోగులకు ఈ డెడ్ లైన్ ను పొడిగించింది. మరోదఫా పొడిగింపు ఉండదని తాజా లేఖ లో స్పష్టంగా పేర్కోంది.
అమెరికా దేశంలో ఇటీవల జరిగిన పరిణామాలే గూగుల్ తమ సిబ్బందికి హెచ్చరికలు జారీ చేసిందని పలుమీడియా సంస్థలు పేర్కోంటున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టే క్రమంలో కొన్ని నిబంధనలు , ఆదేశాలు జారీ చేశారు. నూరు మంది ఉద్యోగులకు పైగా ఉన్న కంపెనీలన్నీ కూడా తమ ఉద్యోగుల ఆరోగ్యానికి బాధ్యత వహించాలని నిబంధన విధించారు. అందరు కూడా తప్పని సరిగా కోవిడ్ టీకా వేయించుకోవాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని కంపెనీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు కూడా. దీంతో అమెరికాలోని కంపెనీలు తమ ఉద్యోగులు తప్పనిసరిగా కోవిడ్ టీకా వేసుకోవాలని సూచించాయి. ఉద్యోగుల భవితను దృష్టిలో పెట్టుకుని ఉండే కంపెనీగా పేరున్న గూగుల్ తమ సిబ్బందికి తాజాగా డెడ్ లైన్ విధించింది.