ఏంద‌య్యో నీ క‌థ : ఈటెల ఎక్క‌డైనా ఒంటరివాడే..?

N ANJANEYULU
టీఆర్ఎస్ పార్టీ ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి మొద‌లుకొని  తెలంగాణ ఉద్య‌మకాలంలో సైతం పాల్గొన్న ఈటెల రాజేంద‌ర్ దాదాపు 14 ఏండ్ల కాలం వ‌ర‌కు టీఆర్ఎస్‌లో కొన‌సాగి.. రెండు మూడు మంత్రి ప‌ద‌వులను చేప‌ట్టిన  విష‌యం విధిత‌మే. ఇటీవ‌ల ఈట‌ల కొన్ని వివాదాల కార‌ణంగా టీఆర్ఎస్ ను వీడీ బీజేపీలో  చేరి.. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొంది బీజేపీకి కొంత ఊపును ఇచ్చారు.

కానీ ఆయ‌న చేప‌డుతున్న ప‌నులు మాత్రం హై క‌మాండ్‌కు చికాకు తెప్పిస్తున్నాయ‌ని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ ఎజెండాను మాత్ర‌మే ముందు ఉంచే బీజేపీలో సొంత ఎజెండాతో ముందుకుపోతూ కొర‌క‌రానికొయ్య‌గా మారుతున్నారు ఈట‌ల‌. అదేవిధంగా పార్టీ శ్రేణుల్లో సైం క‌న్పూజ‌న్ క్రియేట్ చేస్తున్నార‌ని భిన్నాబిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బీజేపీలో అంద‌రిదీ ఒక దారి అయితే.. ఈటెల‌ది మ‌రొక‌దారి..!  నా దారి ర‌హ‌దారి.. నారూటు స‌ప‌రేటు అంటూ సింగిల్ గా దూసుకెళ్తున్నారు ఈట‌ల‌.

హుజూరాబాద్  ఉప ఎన్నిక‌లో ఘ‌న విజ‌యం సాధించిన త‌రువాత ఈట‌ల త‌న సొంత‌రాగ‌మందుకుంటున్నార‌ని టాక్‌. ఈ విజ‌యం త‌రువాత ఇది బీజేపీ గెలుపు కాద‌ని.. త‌న వ్య‌క్తిగ‌త గెలుపు అని అక్క‌డ‌క్క‌డ చేసిన కామెంట్ల‌ను నాయ‌కులు జీర్ణించుకోలేక పోతున్నార‌ట‌.  ఈట‌ల గెలుపుకోసం పార్టీ తీవ్రంగా కృషి చేస్తే ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డ‌మేమిట‌నే భావ‌న అప్ప‌ట్లోనే వ్యక్త‌మైన‌ది. అయితే ఈమ‌ధ్య కాలంలో ఈట‌ల అమ‌లుచేస్తున్న సొంత ఎజెండాను పార్టీ తీవ్రంగా ప‌రిగ‌ణిస్తుంద‌ని తెలుస్తోంది.  
 
ఇటీవ‌ల స్థానిక సంస్థ‌ల కోటా నిర్వ‌హించిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటున్న‌ట్టు కిష‌న్‌రెడ్డి, బండి సంజ‌య్ ప్ర‌క‌టించి.. ప్ర‌జ‌లు ప్రత్యక్షంగా ఎన్నుకునే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌ని  కూడా స్ప‌ష్టం చేసారు. అయితే స్థానిక సంస్థ‌ల‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకే మెజార్టీ ఎక్కువ‌గా ఉన్నందునా.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోటీ చేసినా ఉప‌యోగం ఉండ‌ద‌ని రాష్ట్ర బీజేపీ నాయ‌క‌త్వం భావించింది. అయితే ఈట‌ల మాత్రం క‌రీంన‌గ‌ర్‌లో ర‌వీంద‌ర్‌సింగ్‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌డం.. ఆదిలాబాద్‌లో పుష్పారాణిని తానే పెట్టించిన‌ట్టు ప్ర‌క‌టించారు.  దీనిపై అధిష్టానం చాలా సీరియ‌స్‌గానే ఉంద‌ట‌. ఏక‌ప‌క్షంగా ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు ఎలా చేస్తారు అని.. సీనియ‌ర్లు అంద‌రూ త‌ప్పుబ‌డుతున్న‌ట్టు స‌మాచారం.

ఈటల బీజేపీతో గెలిచిన నాయ‌కుడు కాద‌ని.. ఆయ‌న సొంతంగా గెలిచిన నాయ‌కుడు అని కొంతమంది ఇప్ప‌టికే చెప్ప‌క‌నే చెబుతున్నారు. ఈట‌ల టీఆర్ఎస్‌లో ఉన్నా.. బీజేపీలో ఉన్నా త‌న‌కంటూ ఓ టీమ్ ఉంద‌ని.. ఆ టీమ్ తోనే అత‌ను క‌లిసి ప‌ని చేస్తాడని టాక్‌. ఆయ‌న ఒంట‌రిగా ఉండ‌డం అనేది ఒక విధంగా ఆయ‌న‌కు ప్ల‌స్‌.. పార్టీ ప‌రంగా చూసుకుంటే ఆయ‌న‌కు మైన‌స్ అని తెలుస్తోంది. మ‌రోవైపు ఆయ‌న సామాజిక వ‌ర్గం మ‌ద్ద‌తు ఎల్ల‌వేళ‌లా మ‌ద్ద‌తు ఉండ‌డంతో ఈట‌ల సొంత పార్టీ పెడుతార‌నే వార్త‌లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. బీజేపీ మాత్రం సొంత ఎజెండాతో వెళ్లే నాయ‌కుల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వు అని అంద‌రికీ ఓ హెచ్చ‌రిక జారీ చేయాల‌ని భావిస్తోంద‌ట‌. అయితే ఈట‌ల ఎపిసోడ్ ఎలాంటి ట‌ర్న్ తీసుకుంటుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: