కళాని లేపుతున్న వైసీపీ...ఆయనే కొంపముంచేలా ఉన్నారు!

M N Amaleswara rao
రాజకీయాల్లో ఎన్నో ఒడుదుడుకులు ఎదురుకుని...చివరికి సక్సెస్ అయితే ఆ నాయకులకు చాలా సంతోషంగా ఉంటుందనే చెప్పాలి. కానీ కొందరు నేతలు ఆ సంతోషాన్ని ఎక్కువ కాలం ఉంచుకునేలా లేరు...ఏదో ఎమ్మెల్యేగా గెలిచేశాం కాబట్టి...ఇంకా తమకు తిరుగులేదని అనుకుంటే తప్పులో కాలు వేసినట్లే...అలాగే అధికారం ఉంది కదా అని...సొంత బంధువులకు పెత్తనం ఇస్తే...చిక్కులు తప్పవు. ఇప్పుడు సరిగ్గా ఎచ్చెర్ల వైసీపీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ కూడా అలాంటి చిక్కుల్లోనే పడ్డారు.

2014 ఎన్నికల్లో రాజకీయంగా బలంగా ఉన్న టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు చేతిలో ఓటమి పాలైన సరే...వెనక్కి తగ్గకుండా మళ్ళీ కష్టపడి పనిచేసి...2019 ఎన్నికల్లో రాజకీయ దిగ్గజం కళాని ఓడించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎంతో జాగ్రత్తగా పనిచేసి...ప్రజల మద్ధతు పెంచుకోవాలి...పైగా కళా లాంటి దిగ్గజాలు ప్రత్యర్ధులుగా ఉన్నప్పుడు, వారికి రాజకీయంగా ఎదిగే ఛాన్స్ ఇవ్వకూడదు.

కానీ కిరణ్...కళాకు ఆ ఛాన్స్ ఇచ్చినట్లే కనిపిస్తోంది. మామూలుగానే ఎచ్చెర్ల టీడీపీ కంచుకోట..ఇటు కళాకు మంచి పట్టు ఉంది. కాకపోతే టీడీపీలో ఉన్న గ్రూప్ తగాదాలు వల్ల కళా గత ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది. పైగా ఆయనపై నెగిటివ్ ఉంది. అలాంటప్పుడు కళాని ఇంకా నెగిటివ్ చేయాలి..కిరణ్ ఆ పనిచేయకపోగా, పైగా ప్లస్ చేశారు.

అది కూడా కిరణ్ మేనల్లుడు పిన్నింటి సాయి రూపంలో కళాకు ప్లస్ వచ్చింది. ఎమ్మెల్యే కిరణ్...కానీ అధికారం చెలాయించేది సాయి అని టాక్. ఎవరికి ఏ పనులు కావాల్సిన సాయిని అడగాల్సిందే అంట. పైగా ఈయన సొంత పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండటమే కష్టమైపోతుంది...దీనికి తోడు..సెటిల్‌మెంట్లు, భూ తగాదాల్లో సాయి ఎక్కువ జోక్యం చేసుకుంటున్నారని తెలిసింది. అంటే ప్రజా సమస్యలు వదిలేసి...ఈ సైడ్ వ్యాపారాలు ఎక్కువైపోయాయని...ఎచ్చెర్ల ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. అసలు సాయి పెత్తనం చేస్తుంటే..కిరణ్ ఎందుకు ఎమ్మెల్యేగా ఉండటమని మాట్లాడుకునే పరిస్తితి. మొత్తానికి ఎచ్చెర్లలో కళాని లేపుతున్నారు...ఎమ్మెల్యే మేనల్లుడు చివరికి కొంపముంచేలా ఉన్నారు.    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: