బిపిన్ ఏదో చెప్పబోయారు.. కానీ అర్థం కాలేదు?
ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో 14 మంది ఉండగా 13 మంది దుర్మరణం పాలయ్యారు. ఇక వరుణ్ సింగ్ అనే ఆర్మీ కెప్టెన్ తీవ్ర గాయాలపాలైన చివరికి ప్రాణాపాయ స్థితిలో పోరాటం చేశాడు. ఇటీవలే వరుణ్ సింగ్ విశ్వాస విడిచాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే హెలికాప్టర్ ప్రమాదంపై ఇప్పటికే ఎన్నో అనుమానాలు కూడా తెరమీదకు వచ్చాయి. కెప్టెన్ వరుణ్ సింగ్ కోరుకుంటే ఇక విమాన ప్రమాదానికి అసలు కారణం తెలిసే అవకాశం ఉంది అని అందరూ భావించారు. కానీ చివరికి ఆయన కూడా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఇకపోతే ఇటీవలే త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ అంబులెన్స్ లో తీసుకెళ్లిన సిబ్బంది ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన బిపిన్ రావత్ ను అంబులెన్స్లో తీసుకువెళ్తున్న సమయంలో హిందీలో మాట్లాడారని అంబులెన్స్ సిబ్బంది చెప్పుకొచ్చారు. అయితే తమకు ఏదో చెప్పాలని బిపిన్ రావత్ ప్రయత్నించారని తెలిపారు. అయితే తమకు హిందీ రాకపోవడంతో ఇక బిపిన్ రావత్ ఏమి చెబుతున్నారో అర్ధం కాలేదని.. అంతేకాకుండా అక్కడ ఉన్నది బిపిన్ రావత్ అన్న విషయం కూడా తెలియదు అంటూ అంబులెన్స్ సిబ్బంది చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే తనను కాపాడాలని హిందీలో అడిగారేమో అని అనుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు.