2024 ఎన్నిక‌ల్లో తార‌క్ వ‌ర్సెస్ ప‌వ‌న్‌.. అదే ఫైన‌ల్ ట్విస్ట్‌..!

VUYYURU SUBHASH
ఆంధ్రప్రదేశ్లో 2024 సాధారణ ఎన్నికలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కి కీలకంగా మారాయి. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు తాడోపేడో తేల్చుకో నన్నారు. అందుకే చావో రేవో అన్న‌ట్టు గా పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాలుగు మెట్లు కిందకు దిగేందుకు కూడా వెనుకాడడం లేదని తెలుస్తోంది. మరోవైపు తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో జనసేన తో పొత్తు పెట్టుకుంటుందని కూడా ఇప్పటికే ప్రచారం ప్రారంభమైంది.

2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడంతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అన్న చర్చలు రాజకీయవర్గాల్లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉండటంతో నే చంద్రబాబు నాడు ముఖ్యమంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయడం తో భారీగా ఓట్లు చీలిపోయి.. టిడిపి చిత్తుగా ఓడిపోయింది. అటు జనసేన కూడా గెలవలేదు. వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.

ఇక‌ వచ్చే ఎన్నికల్లో పవన్ ను ఎలాగైనా ఒప్పించి టీడీపీతో పొత్తు కలపాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీని ఎన్నికల్లో గెలిపించేందుకు కొందరు పారిశ్రామికవేత్తలు ...సీనియర్ నేతలు సైతం తార‌క్ ను రాజకీయాల్లోకి తీసుకు వచ్చి తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేయించాలని చూస్తున్నారు.

అటు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే ... ఇటు తార‌క్ ఎన్నికల ప్రచారంలో కి దిగుతారా అంటే కాస్త డౌటే అని చెప్పాలి. ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ .. నారా ఫ్యామిలీ ల‌తో తారక్ కు గ్యాప్ అలాగే కంటిన్యూ అవుతూ వస్తోంది. అందుకే తార‌క్ కు పార్టీ కండువా క‌ప్పి.. ఏదైనా ప‌ద‌వి ఇచ్చి మ‌రీ ఆయ‌న తో ప్ర‌చారం చేయించాల‌ని కొంద‌రు ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ సారి తార‌క్ పై గట్టి ఒత్తిడే ఉండ‌నుంది. మ‌రి తార‌క్ పై ఒత్తిళ్లు ఎలా పనిచేస్తాయో అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: