అమెరికాకే తప్పలేదు.. మనమెంత : విజయసాయి
అయితే అటుజగన్ ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తున్న నేపథ్యంలో ఏ వైపు నుంచి కూడా అప్పులు పుట్టే పరిస్థితి లేదని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తూ ఉండటం గమనార్హం. అయితే ఏపీ ప్రభుత్వం అప్పులు ఎక్కువగా చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తుంది అన్న ప్రతిపక్షాల విమర్శలు పై వైసీపీ పార్లమెంటరీసభ్యుడు విజయసాయి రెడ్డి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇటీవలే మాట్లాడిన విజయసాయిరెడ్డి ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రరాజ్యమైన అమెరికా తో పోల్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువగా అప్పులు చేస్తోంది అని ప్రతి పక్షాల విమర్శలను తిప్పి కొట్టారు విజయసాయిరెడ్డి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన అమెరికా రుణ పరిమితి 2.5 ట్రిలియన్ డాలర్లు పెంచుకోవడానికి కాంగ్రెస్ అనుమతి పొందింది . ఏపీని తమ ప్రభుత్వం అప్పుల పాలు చేస్తుంది అని గుండెలు బాదుకుంటూ మొసలి కన్నీరు కారుస్తున్న వారు ఇది తెలుసుకోవాలి అంటూ విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. కరోనా సృష్టించిన కల్లోలం అగ్రరాజ్యాలనే సంక్షోభంలోకి నెడితే ఇక మనమెంత అంటూ వ్యాఖ్యానించారు. విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయ్.