పుష్ప : కొత్త బన్నీ పుట్టాడ్రా...విజిల్ పొడో!

RATNA KISHORE
అడ‌విలో ఉన్న‌దంతా చీక‌టే
భూమి నుంచి వ‌చ్చే బంగారం అంతా
అదే ఎర్ర‌చంద‌నం అంతా రెండు గుడ్డి దీపాల మ‌ధ్య
దారి మ‌ళ్లిపోతుంది.. ఆ గుడ్డి దీపాల వెలుగుకు 
నియంత్రిత శ‌క్తి ఒక‌టి ఒన‌ర్ షిప్ చేస్తుంది..

అలాంటి ఓన‌ర్ షిప్ పుష్ప‌ది.. ఇంకా ఇంకొంక‌రిది..ఈ రెండు గ్యాంగ్ ల మ‌ధ్య యుద్ధం చీక‌టి నుంచి చీక‌టి వ‌ర‌కు..ఇవ‌న్నీ  వెలుగులోకి రానంత వ‌ర‌కూ  మ‌రి తుపాకీ ఏమైంది ? స‌రిహ‌ద్దు పోలీసు ఏం చేశాడు అడవుల్లో పోలీసు తుపాకీ ..ఎంత వ‌ర‌కూ సెన్స్ లేకుండా పేలింది.. గొడ్డ‌లి వేటుకు తెగిన చెట్లకు ద‌క్కిన ఫ‌లం ఎంత? ఈ క‌థ‌కు మూలం ఎక్క‌డ.. ఇవ‌న్నీ పిరియాడిక‌ల్ సెన్స్ లో  ఆలోచించాలి.. ఫిక్ష‌నల్ పాయింట్ కు క‌నెక్ట్ కావాలి.. ఇన్ని ప‌నులూ చేశాడు బ‌న్నీ.. చేయించాడు సుక్కూ... అనండిక ఆజ్ కా రాజ్ పుష్ప రాజ్.

ఒక క్యారెక్ట‌ర్ సినిమా లైఫ్ ను మారుస్తుంది. ఊహాతీత విజ‌యాల‌ను అందించి వెళ్తుంది. అందుకే ఏ క‌థ‌కు అయినా లీడ్ రోల్ ను డిజైన్ చేయ‌డ‌మే  చాలా ఇంపార్టెంట్. హీరోయిజం ఎలివేష‌న్ అన్న‌ది ఇంకా ముఖ్యం. ఈ రెండూ జాగ్ర‌త్త‌గా న‌డిపితేనే మిగ‌తా సినిమాలోని పాత్ర‌లు వాటి న‌డ‌వ‌డి అన్న‌వి ఆధార‌ప‌డి ఉంటాయి. అందుకే ఏ క‌థ‌లో అయినా అతి ముఖ్యం అనుకునే పాత్ర‌కు కొన్ని ల‌క్ష‌ణాలు నిర్దేశించే రాస్తారు. సుక్కూ కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతూ సినిమాలు తీస్తూ వ‌స్తున్నారు. అవి మంచివా, చెడువా అని కాదు ఓ పాత్ర గ‌మ‌నం స‌మాజ రీతికి అనుగుణంగా ఎలా ఉంటుంది. ఆ త‌రువాత ఆ పాత్ర మార్పు చెందే విధానం ఏమ‌యినా ఉంటుందా లేదా అలానే స‌మాజం అత‌డిని ఉండ‌నిస్తుందా ఇలాంటివెన్నో దృష్టిలో ఉంచుకుని ఆయ‌న సినిమాలు రూపొందుతాయి.


ఈ సినిమా కూడా అలానే రూపుదిద్దుకుంది. క్యారెక్ట‌ర్  లో ఫైర్ ను చివ‌రివ‌ర‌కూ ఉప‌యోగించారు. ఆ క్యారెక్ట‌ర్ కో మ్యాన‌రిజం ఇచ్చారు. డైలాగ్ మ‌ళ్లీ పూర్తి మాసివ్ సెన్స్ వ‌చ్చేలా రాశారు. ఇలా ఈ సినిమా కోసం సుక్కూ చాలా శ్ర‌మించారు. చాలా బాగా తెలిసిన క‌థే కావొచ్చు కొంద‌రికి కానీ ఈ సినిమా కోసం ముఖ్యంగా బ‌న్నీ కోసం చాలా ఎక్కువ స్ట్ర‌గుల్ చేశాడు సుక్కూ. దీంతో సినిమా లెవ‌ల్ ఒక్క‌సారిగా మారిపోయింది. బిజినెస్ రూల్స్ అన్నీ బ్రేక్ అయిపోయాయి. క‌మ‌ర్షియ‌ల్ ప్లాట్ ఫాం పై ఉంటూ ఇలాంటి సినిమాలు చేయ‌డం చాలా క‌ష్టం. కానీ సుక్కూ మాత్రం తాను ఎంచుకున్న క‌థ‌న రీతికి అనుగుణంగా బ‌న్నీని మ‌లిచారు. ఓ విధంగా బ‌న్నీ ఈ సినిమా వ‌ర‌కూ సుక్కూ చెక్కిన శిల్పం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: