ఏపీ గడ్డపైన మరోసారి హవా వైసీపీనేనా..?
తెలుగు రాష్ట్రాల విభజన తరువాత ఇరు తెలుగు రాష్ట్రాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర విభజన జరిగితే కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుందని తెలిసినా.. కనీసం తెలంగాణ ఇచ్చినందుకుతెలంగాణలోనైనా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారనుకున్నారు. కానీ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటంలో ముందున్న టీఅర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చి తెలంగాణ గద్దెమీద కూర్చోబెట్టారు. ఇక నవ్యంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైఎస్సార్సీపీ హోరాహోరీగా పోటీపడగా రాష్ట్ర విభజన తరువాత మొదటి సీఎంగా నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ అభ్యర్థులను గెలిపించి అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ మరోసారి బరిలోకి దిగి పోటీపడి ప్రచారాలు నిర్వహించాయి.
2019 ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతలు అధికారంలో ఉన్న టీడీపీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమైందంటూ అదే ప్రచార సాధనంగా వాడుకున్నారు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నేతలేమో వారి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ముందుపెడుతూ ప్రచారంలో ముందుకు సాగాయి. చివరికి వైసీపి పార్టీ అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలిచి 2019లో అధికారంలోకి వచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అవేమి పట్టించుకోకుండా సీఎం జగన్ తన పాలనను కొనసాగిస్తున్న వేళ.. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఏపీ రాజకీయాలను మలుపు తిప్పాయి. ఆ తరువాత టీడీపీ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయటం.. దానిపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసనలు చేయడం.. అంతేకాకుండా చంద్రబాబు దీక్షకు కూడా దిగారు. ఇదిలా ఉంటే.. గత అసెంబ్లీ సమావేశాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు తనను వ్యక్తిగతంగా వైసీపీ నేతలు విమర్శించారని.. అంతేకాకుండా ఇక నుంచి అసెంబ్లీ అడుగుపెట్టానని.. ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలో అడుగుపెడుతానని శపథం చేసి అసెంబ్లీ నుంచి నిష్క్రమించారు. ఆ తరువాత తన అసెంబ్లీలోని తన ఛాంబర్ లో టీడీపీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి.. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వెక్కి వెక్కి ఏడుస్తూ.. తన భార్యను వైసీపీ నేతలు అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా జరగడంతో మరోసారి ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. నందమూరి ఫ్యామిలీ కూడా మీడియా ముందుకు వచ్చి వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో టీడీపీకి సింపతీ వర్కౌట్ అయ్యింది.
టీడీపీ ఏడుపు రాజకీయాలు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ ఆలోచనలో పడ్డారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత ప్రకటించిన ఏపీలో 3 రాజధానులు బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించారు. దీంతో అప్పటివరకు టీడీపీ నిరసనలపై దృష్టి సారించిన ఏపీ ప్రజలు 3 రాజధానుల విషయంపైకి ఆసక్తి కనబరిచారు. ఇవే కాకుండా భారీ వర్షాలతో నష్టపోయిన వరద బాధితులకు కూడా వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని వరాల జల్లులు కురిపించారు. ఏపీలో వినూత్న సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ జగన్ పాలన సాగిస్తున్నారు. కొన్ని చోట్ల వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నా.. గత ఎన్నికల్లో వచ్చిన్నని సీట్లతో కాకపోయినా తక్కువ మెజార్టీతో మరోసారి ఏపీ గడ్డమీద జగన్ సర్కార్ జెండా ఎగురవేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.