కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం నుంచి తెలంగాణ బిజెపి నేతలకు పిలుపు వచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ఢిల్లీకి రావాలని పిలుపు రావడంతో మంగళవారం ఢిల్లీలోని హోంమంత్రి కార్యాలయంలో తెలంగాణ బిజెపి నేతలు అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ భేటీలో హుజురాబాద్ గెలుపు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీలోని ముఖ్య నాయకుల బాధ్యతలపై దిశానిర్దేశం చేసే ఛాన్స్ కనిపిస్తోంది ఇదిలా ఉంటే తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి వార్ నడుస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే ఆయన తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం ఖరారైన అనివార్య కారణాల వల్ల బిజెపి పార్టీ ఆ భేటీని వాయిదా వేసుకుంది.
ప్రధానంగా తెలంగాణ రాజకీయాలపై చర్చ జరుగుతున్నట్లుగా పార్టీ నాయకులు ధృవీకరిస్తున్నారు. బిజెపి పార్టీ తెలంగాణలో ఏ విధంగా బలపడాలో, ఇటీవల హుజురాబాద్ ఎన్నికల్లో తెలంగాణ బిజెపి అనుసరించిన వ్యూహం, భవిష్యత్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇదేవిధంగా అమలు చేయాలనే అంశం పైన కూడా అమిత్ షా తో బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీలు భేటీ అవుతున్నారు. అమిత్ షా ఆఫీస్ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఫోన్ కాల్ వచ్చింది. అయితే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆయన సోమవారమే ఢిల్లీ కి వెళ్తారు. మంగళవారం రోజు ఉదయం 9 గంటలకు అమిత్ షా తో బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీలు భేటీ అవుతున్నారు. ఈ కీలక భేటీ అంశంలో ప్రధానంగా టిఆర్ఎస్ పార్టీ,అదేవిధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న అంశాలపైన చర్చ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏ ఏ అంశాలపై టిఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి బిజెపి ముందుకు వెళుతుందో, భవిష్యత్తులో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనే అంశంపై ఎంపీలు,ఎమ్మెల్యేలు అమిత్ షా కు పూర్తి వివరణ ఇచ్చే అవకాశం ఉంది.
అనుషా సైతం దక్షిణాదిలో బీజేపీ ముందుకు వెళ్లాలని అంశంతో ముందుకు వెళ్తున్నారు. ఈసారి మూడో సారి పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో అధికారం రావాలంటే ఉత్తర భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో సీట్లు తగ్గితే , ఆ సీట్లను దక్షిణాదిలో పెంచుకోవాలనే వ్యూహంతో బిజెపి జాతీయ పార్టీ ముందుకు వెళుతుంది. భవిష్యత్తులో బిజెపి ఒక బలమైన శక్తిగా ఎదగడానికి ఇలాంటి సమావేశాలు ఉపయోగపడతాయనే ధీమాతో తెలంగాణ బిజెపి నాయకులు ఉన్నారు.