హ్యాపీ సండే : ఎన్టీఆర్ కూతురికి రాజ‌కీయాలు ఎందుకండీ?

RATNA KISHORE
చంద్ర‌బాబు రాజ‌కీయం
ఈ వారం మ‌రోమ‌లుపు
 తీసుకుంది
జ‌గ‌న్ రాజకీయం కూడా
అదే విధంగా మ‌రో కొత్త వివాదం వైపు
మ‌ళ్లింది... జ‌గన్ జీఓల పేరిట సినిమావోళ్ల‌పై
యుద్ధం ప్ర‌క‌టిస్తే.. చంద్ర‌బాబు మాత్రం
తిరుప‌తి కేంద్రంగా భార్య భువ‌నేశ్వ‌రితో రాజ‌కీయం
న‌డిపేందుకు సిద్ధం అవుతూ ఉన్నారు


ఆంధ్రావ‌నిలో ఇంత‌వ‌ర‌కూ రాజ‌కీయాలు అన్ని ఆడ‌వాళ్ల చుట్టూ తిర‌గ‌లేదు సంతోషించాలి మ‌నం. ఏదో కొంత కాలం ఎల్వీ  (పూర్తి పేరు ల‌క్ష్మీ పార్వ‌తి) చుట్టూ రాజ‌కీయం తిరిగినా అదే ఆఖ‌రు అయింది మ‌హిళా ప్రాభ‌వానికి. త‌రువాత తెలుగు రాజ‌కీయాల్లో కిచెన్ పాలిటిక్స్ జోలికి ఎవ్వ‌రూ పోలేదు. ఎన్టీఆర్ కూతురు పురంధ‌రి రాజ‌కీయాల్లో ఉన్నా  కూడా కొంత కాలం కాంగ్రెస్ లో ఇప్పుడు బీజేపీలో ఉన్నా కూడా పెద్ద ప్ర‌భావం అయితే చేయ‌లేదు. కానీ ఇప్పుడు రాజ‌కీయ రంగంలోకి అటు భువ‌నేశ్వ‌రి ఇటు జ‌గ‌న్ భార్య భార‌తి కూడా దిగ‌నున్నార‌ని తెలుస్తోంది. అన్నీ బాగుంటే భార‌తి పాద‌యాత్ర చేస్తార‌ని టాక్ .. అదేవిధంగా భువ‌నేశ్వ‌రి సీమ కేంద్రంగా రాజ‌కీయం న‌డుపుతార‌ని టాక్. ఇవ‌న్నీ ఎలా ఉన్నా కూడా చంద్ర‌బాబు ఫ‌క్తు సానుభూతి రాజ‌కీయాలు న‌డిపేందుకు ఫిక్స్ అయ్యార‌ని తెలుస్తోంది. ఒక నాడు జ‌గ‌న్ ఇప్పుడు చంద్ర‌బాబు అంతే తేడా ఇంకేం పోలిక‌లూ వైరుధ్యాలూ వైవిధ్యాలూ లేవు.


ఈ త‌రుణంలో ఈ నేప‌థ్యంలో  


వీకెండ్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయో చూడండి..ఈ వారం చంద్ర‌బాబు భార్య మ‌రియు ఎన్టీఆర్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీ పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఆమె త్వ‌ర‌లో రాజ‌కీయంగా అరంగేట్రం చేస్తే చేయొచ్చు. అందుకు తిరుప‌తి కేంద్రంగా ఆమె త‌న అదృష్టంను ప‌రీక్షించు కోనూవచ్చు. ఏమ‌యినా చొర‌వ మాత్రం చంద్ర‌బాబుదే! రేప‌టి వేళ తిరుపతి వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించి చెక్కులు అందించే కార్య‌క్ర‌మంకు ఆమె హాజరు కానున్నారు. త‌మ ఎన్టీఆర్ ట్ర‌స్టు త‌ర‌ఫున ఒక్కో బాధిత కుటుంబానికి ల‌క్ష రూపాయ‌లు చొప్పున అందించ‌నున్నారు. అదేవిధంగా వారి యోగ క్షేమాలు తెలుసుకోనున్నారు.  ఇదే ఇప్పుడు రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ కానుంది. పేరుకు ప‌రామ‌ర్శ‌ల ప‌ర్వం అయినా ఇదే అవ‌కాశంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమెను పోటీ చేయించే అవ‌కాశం ఉంద‌ని కొంద‌రు అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: