సైకిల్ పంచాయితీ: ఆ చౌదరీ గారికి రెడ్డి వర్గం దెబ్బవేసేలా ఉందిగా!
ఇక దీనికి అనంతలోని ఇతర నేతలు కౌంటర్లు ఇచ్చారు. కాల్వ శ్రీనివాసులు, ప్రభాకర్ చౌదరీ, పరిటాల సునీతమ్మ, జితేంద్ర గౌడ్ లాంటి నాయకులు జేసీపై ఫైర్ అయ్యారు. ఇదే క్రమంలో అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడుగా ఉన్న కాల్వ శ్రీనివాసులు ....జేసీ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించారు...అదే సమయంలో జేసీ వర్గం సపోర్ట్ ఉన్న శింగనమల ఇంచార్జ్ శ్రావణి వర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇలా అనంతలో నేతల మధ్య రచ్చ జరుగుతుంది.
అయితే ఈ పంచాయితీలు చివరికి తెలుగుదేశం పార్టీ కొంపముంచేలా ఉన్నాయి. ఇప్పుడుప్పుడే అనంతలో పార్టీ పుంజుకుంటుంది. ఇలాంటి సమయంలో నేతల మధ్య ఆధిపత్య పోరు ఇబ్బంది అయ్యేలా ఉంది. ఉదాహరణకు అనంతపురం అర్బన్ ఇంచార్జ్‌గా ఉన్న ప్రభాకర్ చౌదరీకి...జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గానికి పెద్దగా పడదు.
మామూలుగానే అనంత అర్బన్‌లో జేసీ వర్గం ఉంది. ఇక్కడ రెడ్డి ఓటర్లు ఎక్కువే. కానీ జేసీ ఫ్యామిలీతో కయ్యం వల్ల వారు...ప్రభాకర్ చౌదరీకి సపోర్ట్ ఇచ్చే పరిస్తితి కనిపించడం లేదు. గత కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనే అక్కడ ఆధిపత్య పోరు నడిచింది. దాని ఫలితంగానే కార్పొరేషన్లో టీడీపీ చిత్తుగా ఓడింది. ఇప్పుడు ఇలా వార్ నడుస్తోంది. ఇదే పంచాయితీ ఇలాగే కొనసాగితే...నెక్స్ట్ ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరీకే డ్యామేజ్ అయ్యేలా ఉంది.