వామ్మో.. పెళ్లి పీటల మీద లిప్ లాక్.. అందరూ అవాక్?

praveen
ఈ మధ్య కాలంలో పిల్లలు బాగా దూకుడుగా ఉన్నారు. లవ్ పేరుతో ఎంతోమంది పార్కుల్లో  పబ్బుల చుట్టూ తిరుగుతూ ఎంతో మంది ఉన్నా పట్టించుకోకుండా తమ పని తాము కానిచ్చేస్తున్నారు. పార్కుల్లో పబ్బుల్లో ఓకే గాని ఇక్కడ ఒక పెళ్లి మండపంలో ఇద్దరు యువతీ యువకులు ఏకంగా ఒకరినొకరు పెనవేసుకోవటం గమనార్హం. అయితే ఇలా పెళ్లి మండపంలో లిప్ లాక్ తో రెచ్చిపోయింది ఎవరో అనుకునేరు స్వయంగా పెళ్లి చేసుకుంటున్నా  నవ వధూవరులు కావడం గమనార్హం. పెళ్లి పీటల పై కూర్చున్న వధూవరులు ఇద్దరూ కూడా లిప్ లాక్ తో రెచ్చిపోవడంతో  అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.


 ముందుగా పెళ్ళి పీటల మీద పెళ్లి కొడుకు యువతిని ముద్దు పెట్టుకోగా నేను ఏమైనా తక్కువ అన్నట్లుగా పెళ్లి కొడుక్కి మరింత గాఢంగా కిస్ ఇచ్చేసింది వధువు.  చుట్టుపక్కల జనం ఉన్నారని పక్కనే పురోహితుడు కూర్చొని ఇదంతా చూస్తున్నాడు అని మాత్రం అస్సలు పట్టించుకోలేదు. ఇక ఎంతో సేపటి వరకూ ముద్దులో లీనమైపోయారు ఈ కొత్త జంట. ప్రస్తుతం ఈ కొత్త జంట వ్యవహారం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ విషయం గురించి తెలిసిన వారు వామ్మో వీళ్ళు మామూలోళ్లు కాదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.



 ఈ మధ్యకాలంలో ఇలాంటివి ఎన్నో పెళ్లి వేడుకలో కూడా జరుగుతూ ఉండటం గమనార్హం. అయితే గతంలో పెళ్లి వేడుకలో బుల్లెట్ బండి పాట పై పెళ్లి కూతురు డాన్స్ చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు ఈ కిస్సింగ్ సీన్ కాస్త అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.. సాధారణంగా తలంబ్రాలు పెళ్లి తంతు ముగిసిన తర్వాత అక్కడ ఉన్న పెద్దలు బంధువులు ఒకసారి ముద్దు పెట్టుకోండి అంటూ కొత్త జంటను సరదాగా ఆదేశించారు. అయితే బంధువులు చెప్పిన సరదా మాటనే అక్కడున్న వరుడు మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అందరి ముందే పెళ్లి కూతురికి లిప్ లాక్ పెట్టేసాడు.. ఎంతకీ కూడా వదలక పోవడం తో పెళ్లి కూతురు కూడా నేనేమీ తక్కువ కాదు అన్నట్లుగా అతనికి సపోర్ట్ చేసి భుజాలమీద చేతులు వేసి మరింత గాఢంగా ముద్దు పెట్టింది.  ఇలా నూతన వధూవరులు  పెళ్లి మండపంలోనే రెచ్చిపోయి పెన వేసుకోవడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: