రాజకీయ పార్టీలు, నాయకుల్లారా ఏమైనా చేసి అధికారం పొందుదాం అని ఆలోచన చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని అది మంచిది కాదన్నారు ఈటల రాజేందర్. బెంగాల్లో లాగా బీజేపీ వారిపై దాడులు చేయండి, తన్ని తరమండి అని కెసిఆర్ చెప్పారట.. కెసిఆర్ గారు ఒక్కటి గుర్తు పెట్టుకోండి,
ఇది బెంగాల్ కాదు బిడ్డ ఇది తెలంగాణ. ముట్టుకుని చూడు తెలుస్తుందని హెచ్చరించారు ఈటల. ధరణి తీసుకువచ్చి దొరలకు మళ్లీ భూములు అప్పజెప్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారని.. రైతు ఉసురు తప్పదని వార్నింగ్ ఇచ్చారు. సీఎం కెసిఆర్ గారు ఈటల రాజేందర్ మొఖం అసెంబ్లీ లో కనిపించవద్దు అని హుకుం జారీ చేసి.. పూర్తి అధికార, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని.. కుటుంబాలను చెరబట్టారని అగ్రహించారు ఈటల. 600 కోట్ల నల్లధనం ఖర్చు చేశారు.
ఒక్కో నాయకుడికి 2 లక్షల నుండి 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎన్ని చేసినా హుజూరాబాద్ ప్రజలు తెలంగాణ ఆత్మ గౌరవం గెలిపించారు. ప్రజాస్వామ్యంను గెలిపించారు. కెసిఆర్ చెంప చెళ్లుమనిపించారు.ఎమర్జెన్సీ తరువాత అంతగా ఎదురుచూసిన ఫలితం హుజూరాబాద్ ఎన్నిక అని తెలిపారు ఈటల. రాజకీయ పార్టీలు, నాయకుల్లారా ఏమైనా చేసి అధికారం పొందుదాం అని ఆలోచన చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్న. అది మంచిది కాదని.. అధికారులు, పోలీసులు స్వేచ్ఛగా, రాజ్యాంగబద్దంగా పనిచేసే పరిస్థితి రాష్ట్రంలో లేకపోవడం బాధాకరమని చెప్పారు ఈటల.
పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు పాలన చేస్తున్నారు. కానీ కెసిఆర్ పాలనను ప్రజలు పారద్రోలడం ఖాయమని ఫైర్ అయ్యారు ఈటల. ఈ వేదిక మీద నుండి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా... ఏ పార్టీ ఏం చేస్తుంది గమనించండని కోరారు ఈటల. ప్రజలకు భద్రత కల్పించడం సీఎం మొదటి కర్తవ్యం. కానీ బెంగాల్లోలాగా బీజేపీ వారిపై దాడులు చేయండి, తన్ని తరమండి అని కెసిఆర్ చెప్పారట.. కెసిఆర్ గారు ఒక్కటి గుర్తు పెట్టుకోండని హెచ్చరించారు ఈటల.