వింత ఆచారం.. ముళ్ళకంపలపై అలా చేశారు?
నాగరిక సమాజంలో కి అడుగు పెడుతున్నాము అని చెబుతూనే ఇంకా అనాగరిక ఆచారాలను మాత్రం పాటిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో కొన్ని కొన్ని ప్రాంతాలలో ప్రజలు పాటించే వింత ఆచారాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. కొన్ని కొన్ని ప్రాంతాలలో అయితే వింత ఆచారాలు ఏకంగా ప్రాణాలను పణంగా పెట్టే విధంగా ఉండటం గమనార్హం. ఇటు ఇటీవల ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. నేటి నాగరిక సమాజంలో కూడా ఇంకా మూఢనమ్మకాలు వదిలిపెట్టడం లేదు అన్నదానికి ఈ ఘటన నిదర్శనంగా మారిపోయింది.
మధ్య ప్రదేశ్ లోని బేతులు జిల్లా లో ఓ గ్రామానికి చెందిన కొంతమంది వింత ఆచారాన్ని పాటించారు. ఏకంగా ఒక ముళ్ళకంప పట్టుకుని అటూ ఇటూ దొర్లడం చేశారు. సెహేరా గ్రామంలోని రజ్జడ్ ప్రజలు తాము పాండవుల వారసులం అంటూ చెబుతూ ఉంటారు. అయితే పురాణాల్లో పాండవులు సత్య నిష్ఠ ను నిరూపించుకునేందుకు ముళ్ళకంప పై దొర్లడం చేశారట. ఇక ఇప్పుడు ఇదే తరహాలో తాము కూడా ఇలాంటి ఆచారం పాటిస్తున్నామని చెబుతున్నారు అక్కడి ప్రజలు ముళ్ళకంప పై దొర్లడం వల్ల దేవుడు సంతోషించి కోరికలు నెరవేరుస్తాడని నమ్ముతూ ఉంటారట అక్కడి జనాలు ఇలా ముళ్ళపై దొర్లిన తర్వాత సోదరుని అత్తారింటికి పంపుతు వీడ్కోలు పలకడం చేస్తారట.