జ‌గ‌న్ వారిపై చ‌ర్య‌లు తీసుకుంటారా...!

VUYYURU SUBHASH
ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నారు. వినూత్న ప‌థ‌కాల‌తో స‌రిలేరు నీకెవ్వ‌రూ అని అనిపించుకుంటున్నారు. అయితే.. ఇన్ని ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నా.. ఇంత సంక్షేమం ప్ర‌వేశ పెట్టినా ఎక్క‌డో పంటికింద రాయిమాదిరిగా.. జ‌గ‌న్ స‌ర్కారుకు ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. తాజాగా .. జ‌గ‌న‌న్న ప‌థ‌కాల‌కు సంబంధించిన అవినీతి వ్య‌వ‌హారం.. కోడై కూస్తోంది. సోష‌ల్ మీడియాప్లాట్ ఫాంపై ఈ విష‌యం పెద్ద ఎత్తున ర‌గులుతోంది. మ‌రి ఏం జ‌రిగింది? ఎక్క‌డ జ‌రిగింది? ఎవ‌రు చేశారు? అనే విష‌యంపై ప్ర‌భుత్వం ఇప్పుడు దృష్టి పెట్టింది.

జ‌గ‌న్ స‌ర్కారు తొలినాళ్ల‌లో పేద‌ల‌కు పంపిణీ చేసే రేష‌న్ విష‌యంలో అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చిం ది. దీనిలో భాగంగా పేద‌ల‌కు ఇచ్చే బియ్యం తూకంలో ఎలాంటితేడాలు రాకుండా ఉండే ఉద్దేశంతో.. నేరుగా 5, 10, 15, 20 కేజీలు ప‌ట్టే బియ్యం సంచుల‌ను ప్ర‌త్యేకంగా త‌యారు చేయించింది. దీనికి గాను రూ.35 కోట్ల‌ను ఖ‌ర్చు చేసింది. వీటిలో బియ్యాన్ని నింపి.. నేరుగా రేష‌న్ డీల‌ర్ల‌కు పంపిణీ చేశారు. త‌ర్వాత కాలంలో ఇంటింటికీ రేష‌న్ ప‌థ‌కాన్ని అమ‌లు చేశారు. ఈ క్ర‌మంలో అదే త‌ర‌హాలో సంచుల‌ను ల‌బ్ధిదారులు పంపీణి చేశారు.

ఈ సంచుల‌పై జ‌గ‌న్‌, ఆయ‌న తండ్రి వైఎస్ ఫొటోల‌ను ముద్రించి ఇచ్చారు. అయితే.. ఇప్పుడు ఈ సంచు ల్లో అవినీతి జ‌రిగిన విష‌యం ప్ర‌భుత్వం దృష్టికి వ‌చ్చింది. ఎలాగంటే.. ఈ సంచులు.. పెద్ద మొత్తంలో రాష్ట్రం నుంచి త‌ర‌లిపోయాయి. అవి ఏకంగా కేర‌ళ‌లోని అయ్య‌ప్ప స్వామి ఆల‌యం వ‌ద్ద వ్యాపారం నిర్వ‌హించే వారి వ‌ద్ద ల‌భిస్తున్నాయి. అక్క‌డ ఈ సంచుల‌ను రూ.50, రూ.100ల‌కు అక్క‌డి వ్యాపారులు విక్ర‌యిస్తున్నారు. ఈ విష‌యంలో ఏపీ నుంచి అయ్య‌ప్ప స్వామి ద‌ర్శ‌నానికి వెళ్లిన వైసీపీ అభిమానుల కంట ప‌డింది.

వెంట‌నే వారు వీడియోలు తీసి.. సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డంతోపాటు.. పార్టీ కార్యాల‌యానికి కూడా పంపించారు. దీంతో ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. అస‌లు ఇవి ఎలా రాష్ట్ర స‌రిహ‌ద్దులు దాటిపోయాయ‌నే విష‌యంపై ఆరాతీసింది. మ‌రోవైపు ల‌బ్ధిదారుల్లో స‌గం మందికి కూడా ఈ బ్యాగులు ఇవ్వ‌లేద‌నే విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. దీంతో ఇప్పుడు సీరియ‌స్‌గా తీసుకున్న ప్ర‌భుత్వం పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌లో అస‌లు ఏం జ‌రుగుతోంద‌నే విష‌యంపై అధికారుల‌ను రంగంలోకి దింపింది. దీంతో పౌర స‌ర‌ఫ‌రాల శాఖ అధికారులు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: