ఓమిక్రాన్ కి మందు కావాలా.. ఈ నెంబర్ కి ఫోన్ చేయండి?

praveen
మొన్నటివరకు కరోనా వైరస్ తో అల్లాడి పోయాయి ప్రపంచ దేశాలు. ఇప్పుడు కరోనా వైరస్ కొత్త వేరియంట్ను ఓమిక్రాన్ భయం ప్రపంచ దేశాలను మరింతగా వణికిస్తోంది. రెండవ దశలో వ్యాప్తిచెందిన డెల్టా వేరియంట్ కంటే ఈ కొత్త వేరియంట్ మరింత ప్రమాదకారి అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో ఇక అన్ని దేశాలు ముందుగానే అప్రమత్తం అవుతున్నాయి.  ఈ కొత్త వేరియంట్ పై అటు టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయా లేదా అన్న దానిపై శాస్త్రవేత్తలు ఖచ్చితమైన సమాధానం చెప్పడం లేదు. ఇక భారత్లో కూడా ఓమిక్రాన్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోవడం అందరినీ కలవరపెడుతోంది.


 తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో ఇటీవల ఓమిక్రాన్ కేసు నమోదు కాగా.. అందరూ భయపడిపోయారు. కానీ అతను కోలుకోవడం తో  ఊపిరిపీల్చుకున్నారు. ఇక తెలంగాణలో 20 కేసులు బయటపడ్డాయి. ప్రజలందరూ భయాందోళనలో మునిగిపోతున్న సమయంలో భయం అవసరంలేదు నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు ఆయుర్వేద నిపుణులు ఆనందయ్య. కరోనా వైరస్ సెకండ్ వేవ్  సమయంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య కరోనా వైరస్ కు మందు కనిపెట్టి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయారు. ఈయన మందు బాగా పనిచేస్తుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం కూడా ఊపందుకుంది.


 దీంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి సైతం వచ్చి ఆనందయ్య మందు కొనుగోలు చేశారు. ఇకపోతే ఇటీవల కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కు సంబంధించిన మందు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య. కొత్త వేరియంట్ గురించి ఆందోళన అవసరం లేదని. ధన్వంతరి భారతీయులకు వరం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. శీతాకాలంలో ముందస్తుగా ఓమిక్రాన్ తో పాటు ఇతర వ్యాధులకు కూడా ఆయుర్వేద మందులు తయారు చేసినట్టు చెప్పుకొచ్చారు. మందు అందరికీ అందుబాటులో ఉంది అంటూ చెప్పుకొచ్చారు. తాను తయారు చేసిన మందులు 15 రోజులకొకసారి వాడితే సమస్య రాదు అంటూ తెలిపారు. ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉన్నా ఇతర సమాచారం కోసం  9100036881 ఈ నెంబర్కు ఫోన్ చేయాలంటూ చెప్పడం గమనార్హం. సెకండ్ వేవ్ సమయంలో కరోనా వైరస్ మందు తో ఫేమస్ అయిన ఆనందయ్య ఇక ఈ సారి ఎలాంటి ప్రభావం చూపుతారో అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: