ఏపీ ఉద్యోగులకు కొత్త డీఏ విడుదలకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ప్రభుత్వం గతంలో ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం
జనవరి నుండి డీఏ ఇవ్వాలనే ప్రతిపాదనకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇవాళ లేదంటే రేపు ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఒక అడుగు ముందుకు వేసింది.తాజాగా డీఏ విడుదలకు సంబందించినటువంటి అంశంలో కొన్ని మార్గదర్శకాలను గుర్తించింది. అందులో భాగంగా ఇప్పుడు కొత్త డిఏ కి సంబంధించిన విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది.
గతంలో ఒక షెడ్యూల్ ను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. అందులో భాగంగా
జనవరి నుంచి ఒక డీఏ ఇవ్వాలనే ప్రతిపాదనకు ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటికిప్పుడు ఆర్థికపరమైనటువంటి భారం అయినటువంటి నేపథ్యంలో గత కొంతకాలంగా ఉద్యోగులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఖరిపైన మండిపడుతూ ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.ఇప్పటికే డీఏ లకు సంబందించి నాలుగుకి పైగా పెండింగ్ లో ఉండటంతో ప్రస్తుతం వాటినయినా కనీసం విడుదల చేస్తే ఆర్థికంగా తమకు వేసులుబాటు కలుగుతుంది అనేది ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. గత కొంతకాలంగా ఉద్యోగులు కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం డీఏల విడుదలకు సంబంధించి గతంలో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ షెడ్యూల్ ప్రకారం విడుదల చేస్తే కొంత వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వానికి కూడా ఆర్థిక భారం తగ్గుతుంది.
జనవరి నుంచి షెడ్యూల్ ప్రకారం ఒక డీఏ ఇచ్చేందుకైతే ప్రభుత్వం సిద్దమైనట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే
గవర్నమెంట్ ఎంప్లయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అయినటువంటి వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులు చాలా రోజుల నుండి కోరుకున్నటువంటి డీఏ విడుదలకు మార్గం సుగమమైంది. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెండు లేదా మూడు రోజుల్లో దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా విడుదల చేస్తారని ప్రకటన చేసింది.