ఒమిక్రాన్ పోయి 'వైరస్ ఫ్రీ' దేశం అవుతుందా?
అయితే మన దేశంలో ఒమిక్రాన్ పరిస్థితులు గమనిస్తే ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారు సైతం ఈ వేరియంట్ బారిన పడుతున్నారు. ఇతర రాష్ట్రాలలోనూ ఇవే పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో WHO ఒమిక్రాన్ ను వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా ప్రకటించడం మరీ ఎక్కువ భయాందోళనలు పెంచుతోంది. అయితే చాలా దేశాలు మళ్ళీ కరోనా ఆంక్షలను మళ్లీ అమలులోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలు వివిధ ఆంక్షలను ప్రకటించి అమలు చేస్తున్నాయి. మాస్క్ లు లేకుండా ప్రజలను ఇల్లు దాటొద్దు అంటూ , శానిటైజర్ వాడకం, సోషల్ డిస్టెన్స్ ఇలా అన్ని మళ్ళీ మొదటికొస్తున్న క్రమంలో మళ్ళీ మన మానవ జీవితాలు కట్టడికి గురవుతున్నాయా అంటూ అందరూ బాధపడుతున్నారు.
అమెరికా, న్యూయార్క్ వంటి పాశ్చాత్య దేశాలలో మాస్క్ లు కంపల్సరీ అన్న రూల్స్ పెట్టేసారు. భారత్ తో సహా పలు దేశాలు రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికెట్, ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ వంటి టెస్టుల రిపోర్ట్ చూపిస్తే కానీ తమ దేశం లోకి ఎంట్రీ లేదు అని తేల్చి చెప్పాయి. ఎయిర్ పోర్ట్ ల వద్ద నిఘాలు పెంచి మరీ ఈ ఆంక్షలను అమలు చేస్తున్నాయి. మరి ఒమిక్రాన్ ఉదృతి మొదట్లోనే అరికట్టాలన్న ప్రపంచ దేశాల ప్రయత్నాలు సఫలం కావాలనే కోరుకుందాం. త్వరలోనే ప్రపంచం వైరస్ ఫ్రీ అవ్వాలని ఆకాంక్షిద్దాం