పుట్టిన రోజు సందర్భంగా ప్రజలకు ఇసుక ఉచితంగా ఇవ్వండి ?

Veldandi Saikiran
అమరావతి ఇసుక తవ్వకాల్లో నెలకు రూ. 600 కోట్ల అక్రమాలు ఉన్నాయ‌ని.. మాజీ మంత్రి సోమిరెడ్డి ఆరోపణ చేశారు.
 జేపీ కంపెనీ ఇసుక తవ్వకాలు, సరఫరాపై సమాచార చట్టం ద్వారా లెక్కలు బయటపెట్టారు సోమిరెడ్డి. రోజు కు 2 వేల లారీల ఇసుకను అక్రమం గా ఆంధ్ర ప్ర‌దేశ్  రాష్ట్రం నుంచి బయటకు పోతుందని నిప్పులు చెరిగారు.  జగన్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వ ఇసుక పాలసీతో ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయ‌ని ఓ రేంజ్ లో రెచ్చి పోయారు సోమిరెడ్డి. ఇసుక టన్ను రూ. 475 ధరగా నిర్ణయించామని చెప్పారు.. ఇప్పుడు రూ. 900 కు అమ్ము తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు సోమిరెడ్డి.  

మార్కా పురం లో ఇసుక టన్ను రూ. 1200 అమ్ముతున్నారని ఫైర్ అయ్యారు సోమిరెడ్డి. ఇరిగేషన్ శాఖ డ్రెడ్జింగ్ చేసే ఇసుకను కూడా జేపీ కంపెనీకే ఎందుకు ఇస్తున్నారు ? అని నిల‌దీశారు సోమిరెడ్డి. ఇరిగేషన్ శాఖ సొంత ఖర్చుతో కృష్ణా నదిలో డ్రెడ్జింగ్ చేస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు సోమిరెడ్డి. డ్రెడ్జింగ్ ద్వారా వచ్చిన రూ.570 కోట్ల విలువైన ఇసుకను జేపీ కంపెనీకి ఇవ్వడమేంటీ..? అని ప్ర‌శ్నించారు సోమిరెడ్డి.
జేపీ కంపెనీకి పని దక్కే సరికి రూ.70 కోట్ల విలువైన ఇసుక యార్డు లో నిల్వవుంది.. ఆ ఆదాయం ఏమయ్యింది..? అని ఓ రేంజ్ లో రెచ్చి పోయారు సోమిరెడ్డి.  ఒక లారీ ఇసుక రూ. 1 లక్షకు అమ్ముతున్నారు.. నెలకు రూ. 600 కోట్లు ఇసుక ద్వారా దోచుకుంటున్నారని మండిప‌డ్డారు సోమిరెడ్డి. వినియోగదాలు తమ బుకింగుల ద్వారా రూ. 10 కోట్ల డబ్బులు కడితే వాటిని తిరిగి చెల్లించలేదని నిప్పులు చెరిగారు సోమిరెడ్డి.  తన జన్మ దినం సందర్భం గా జగన్ రాష్ట్ర ప్రజలకు ఇసుక ఉచితంగా ఇవ్వాలని కోరుతున్నాన‌ని చెప్పారు సోమిరెడ్డి.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ ఏదైనా చేయాల‌ని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: