తెలంగాణ బిజెపి నేతలతో కేంద్రమంత్రి పియుష్ గోయల్ భేటీ ముగిసింది. రైతులను తెలంగాణ ప్రభుత్వం గందరగోళానికి గురి చేస్తుందని పీయుష్ గోయల్ అన్నారు. తెలంగాణలో పరిస్థితుల్ని బిజెపి నేతలు ఎప్పటికప్పుడు కేంద్రానికి అందిస్తూనే ఉన్నారు. ఐదేళ్లలో తెలంగాణలో పండే పంట మూడు రెట్లు పెరిగిందని గోయల్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 27 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇంకా ఎఫ్సిఐ అందించలేదని ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న ధాన్యాన్ని అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
ఇక అదనంగా 20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చామని పియుష్ గోయల్ అన్నారు. టిఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బాయిల్డ్ రైస్ కొనుగోలుపై కేంద్రం,తెలంగాణ మధ్య ఒప్పందం కుదిరిందని బియ్యం తీసుకునేందుకు ఎఫ్సీఐ రెడీగా ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ భేటీలో ఇటు కిషన్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య ఒప్పందం కుదిరినట్లుగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులతో డ్రామాలు ఆడుతోందని, పెద్ద ఎత్తున రైతులను ఆందోళన పరుస్తూ ఇబ్బందులకు గురి చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మేము ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మీద ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఎక్కడ కూడా చేయలేదు. మేము ఒప్పుకున్నటువంటి ఒప్పందమే కాకుండా దానికంటే ఎక్కువ రేట్లు అవకాశాలు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని విమర్శలు చేశారు.
కొన్ని రాజకీయ కారణాల వల్ల ఈ రకమైనటువంటి మాటలు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. అలాగే తెలంగాణ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బిజెపి పార్టీ అండగా ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు. అవసరమైన ఇటువంటి పరిస్థితుల్లో కచ్చితంగా ఆదుకుంటుందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని, ప్రభుత్వం చేయకుండా బిజెపి కేంద్ర ప్రభుత్వం మీద ఈ రకమైనటువంటి విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదంటూ పీయూష్ గోయల్ వ్యాఖ్యలు చేశారు. మరి దీనిమీద రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది చూడాల్సి ఉంది.