జగన్ @ 49: జగన్ సీఎం కావడానికి దోహదపడిన అంశాలివే?
అయితే వై ఎస్ జగన్ సీఎం పీఠాన్ని అధిష్టించడానికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంపిక అవ్వడానికి వెనుక ఇవే అసలు కారణాలు అని కొన్ని వినిపించాయి. ఇంతకీ అవేంటో ఒకసారి చూద్దాం పదండి.
* మొదటగా మనం చెప్పుకోవాల్సింది వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి దృఢ సంకల్పం, అభివృద్ధి మార్గంలో ప్రజా పాలనే ఆయన లక్ష్యంగా చేసుకుని ఆయన ఆలోచనలను, ప్రజలకు కావలసిన సహాయ సహకారాలను అందించడానికి, తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడిగా ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ సిఎంగా ప్రజలకు సేవ చేయాలనే ఆయన దృడ సంకల్పం ఆయన్ని ముఖ్యమంత్రి కుర్చీకి చేరువ చేసిందని అంటుంటారు.
* అలాగే పాదయాత్ర అనే మహా యాగంతో ప్రజల గుండె చప్పుడు విన్న నేతగా ఆయన్ని ఏపి తెలుగు ప్రజలకు మరింత దగ్గర చేసింది.
* వై ఎస్ జగన్ గారి ఆలోచన విధానం, ఆయన మాటల్లో కనిపించే ఏపి భవిష్యత్తు ప్రజల మనసు గెలుచుకునేలా చేసింది.
* నాయకుడు అంటే ప్రజలను ముందుండి నడిపించడమే కాదు ఒక స్నేహితుడిగా, అన్నగా, బిడ్డగా వారిలో ఒకరిగా ఉండి వారి భవిష్యత్తును బంగారు బాటగా మలిచే సంస్కరణలు చేయడం అనే మానిఫెస్టోతో అర్థమయ్యేలా చేశారు.