కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కొట్లాటేనా.. ప్రజా సమస్యలు పట్టవా..!

MOHAN BABU
 రబీ పంట ధాన్యాన్ని భవిష్యత్తులో కొనుగోలు చేస్తారా.. ?లేదా..? అనే ఏకైక డిమాండ్తో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేస్తూ ధర్నాలు  నిరసనలతో రాష్ట్రంలో పాలనను మాత్రం పక్కదారి పట్టిస్తున్నారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలు, హామీలు, ఫేండింగ్ లో ఉన్న అనేక సమస్యలు, పండించిన ధాన్యం తక్షణ కొనుగోలు వంటి విషయాలను పక్కనపెట్టి కేంద్రంతో  తలపడడం ప్రజాస్వామిక దృక్పథం కాదు. బెదిరింపులతో కేంద్రంతో బేరసారాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సమస్యలపై ఇచ్చిన హామీల పైన రాష్ట్ర ప్రజానీకం, ప్రజాసంఘాలు, అఖిలపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అంతకు మించి బెదిరించడానికి నిలదీయడానికి సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి.


     కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధాల గురించి రాజ్యాంగ తో పాటు అనేక కమిషన్లు కూడా మార్గదర్శకాలు వెలువరించిన వి. నిబంధనల మేరకు ప్రాతినిధ్యాలు, చర్చలు, స్థానిక పరిస్థితులు, ప్రత్యామ్నాయ విషయాలను చర్చించి హుందాగా వ్యవహరించవలసిన ది పోయి "మెడలు వంచుతాం, వెంటబడతాం, వదిలిపెట్టే సమస్య లేదు," అని చులకన మాటలు రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో మాట్లాడడం పూర్తిగా అసందర్భం. రాష్ట్ర ప్రజానీకం రాష్ట్రంలోని ప్రతిపక్షాలు రాష్ట్రంలోని ప్రజా సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలి.


ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగించాలి. అప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిజమైన తెలంగాణ ప్రభుత్వంగా భాసిల్లుతోంది.   అనేక విషయాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రులు మాట్లాడుతున్నారు. అవును బాధ్యతను విస్మరించి ఇతరులపై  నెట్టివేసి కేంద్రంతో ఘర్షణ పడే ధోరణిలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం దేశంలో మొదటి ర్యాంకు లో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. "తన ముఖాన్ని తాను చూసుకోకుండా ఇతరుల ముఖాన్ని అవమానించి ఆడిపోసుకుంటూ ఉంటే ఏ రకంగా చులకనవుతారో "అదే రకంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: