ఆ రెండు చోట్ల తమ్ముళ్ళు తగ్గడం లేదుగా..!
ఈ క్రమంలోనే కొన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు, కొత్తవారికి బాధ్యతలు అప్పగించారు. అలాగే మరికొన్ని చోట్ల సరిగ్గా పనిచేయని నాయకులని పక్కనబెట్టి కొత్తవారికి ఛాన్స్ ఇస్తున్నారు. అయితే ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో ఇంచార్జ్లని పెట్టాల్సి ఉంది. దీంతో ఇంచార్జ్ పదవి కోసం పలువురు టీడీపీ నేతలు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని చిత్తూరు అసెంబ్లీ, సత్యవేడు నియోజకవర్గాల్లో తమ్ముళ్ళ మధ్య గట్టి పోటీ ఉంది.
గత ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీలో మనోహర్ పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు. అప్పటినుంచి అక్కడ టీడీపీని నడిపించే నాయకుడు లేకుండా పోయారు. ఈ క్రమంలోనే పలువురు నాయకులు చిత్తూరు సీటు కోసం ట్రై చేస్తున్నారు. మాజీ మేయర్, నగర టీడీపీ అద్యక్షురాలు కటారి హేమలత మొదట నుంచి చిత్తూరు సీటుపై కన్నేశారు. అటు జిల్లా టీడీపీ ఉపాద్యక్షుడు కాజూరు బాలాజీ సైతం ఇన్ఛార్జ్ పదవిని ఆశిస్తున్నారు. అలాగే చంద్రగిరి బాధ్యతలు చూసుకుంటున్న పులివర్తి నాని సైతం చిత్తూరుకు రావాలని చూస్తున్నారు. అలాగే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురుజాల మహదేవ సందీప్ కూడా ఇంచార్జ్ పదవి కోసం ట్రై చేస్తున్నారు.
ఇక సత్యవేడు సీటు కోసం పోటీ ఎక్కువగానే ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన జేడీ రాజశేఖర్...అక్కడ పనిచేస్తున్నారు..కానీ ఆయనకు పోటీగా కొందరు నాయకులు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే హేమలత సైతం సత్యవేడు సీటు కోసం ట్రై చేస్తున్నారు. మొత్తానికి టీడీపీలో మాత్రం సీట్లు కోసం గట్టిగానే పోటీ ఉన్నట్లు కనిపిస్తోంది.