ఒమిక్రాన్: ఆనందయ్య మందుకు ప్రభుత్వం నుండి సపోర్ట్ దొరికేనా?

VAMSI
కరోనా సెకండ్ వేవ్ తర్వాత కాస్త కరోనా వ్యాప్తి తగ్గడంతో లాక్ డౌన్ ను మెల్లమెల్లగా అన్ని దేశాలు ఎత్తివేస్తూ వచ్చాయి. మరో వైపు వ్యాక్సిన్ కూడా దాదాపు చాలామంది తీసుకోవడంతో అందరూ భయాన్ని వీడి స్వేచ్చగా తిరగడం మొదలుపెట్టారు. ఇంతలో మరో పిడుగులాంటి వార్త.. కరోనా రూపాంతరం చెంది ఒమిక్రాన్ గా కొత్త అవతారం ఎత్తి మళ్ళీ ఆందోళన పెంచింది. ఇటువంటి కష్టతర సమయంలో ఈ వైరస్ ని అరికట్టే ఔషదం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తున్న సమయంలో శుభవార్తను తెలిపారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య. ఈ పేరు అందరికీ బాగా గుర్తు ఉండే ఉంటుంది.

కరోనాతో ప్రపంచం విలవిల లాడుతున్న సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎందరో ప్రజల ప్రాణాలను తమ ఆయుర్వేద ఔషదంతో రక్షించారు. పొరుగు రాష్ట్రాల వారు సైతం ఈ ఔషధం యొక్క విలువ తెలుసుకుని ఆనందయ్య ఔషదం పంపిణీ చేసే ప్రాంతంలో బారులు తీరారు. ప్రభుత్వం సైతం ఆ ఔషధాన్ని అన్ని విధాలుగా పరీక్షించి సురక్షితమేనని, హాని కలుగదు అని ధృవీకరించడంతో ఔషదం కోసం వచ్చే వారి సంఖ్య మరింత పెరిగింది. అలా ఆనందయ్య తయారు చేసే ఔషదంపై తెలుగు ప్రజలకు బాగా నమ్మకం ఉంది.

కాగా ఇపుడు మళ్ళీ ఒమిక్రాన్ ఆంధ్రప్రదేశ్ లోనూ విజృభిస్తున్న సమయంలో తాజాగా ఆనందయ్య
ఒమిక్రాన్ వేరియంట్ పై స్పందిస్తూ ఈ ఔషధం గురించి తెలియ చేశారు. ఒమిక్రాన్ కు కూడా తాను ఔషదం తయారు చేశానని అది సమర్థవంతంగా అరికట్టగలదని 48 గంటల్లోనే ప్రభావం చూపి తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఒమిక్రాన్ సోకిన వారికి మందు ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని ప్రకటించారు. ఒకవేళ పొరపాటున భవిష్యత్తులో ఒమిక్రాన్ కేసులు పెరిగినా సరే ఎన్ని వేలమందికైనా మందు సప్లయ్ చేయడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. అయితే ముందులాగా ఆనందయ్యకు ఏ మాత్రం ప్రభుత్వం నుండి సపోర్ట్ దొరుకుతుందో తెలియని పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: