కేసీఆర్ వ్యూహాలు: ముందస్తు విజయం వరిస్తుందా..లేదా..!

MOHAN BABU
 తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేసినా దానికి ఓ రీజన్ ఉంటుందంటారు గులాబీ నేతలు. తమ బాస్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికో విశేషం ఉంటుందంటారు. కెసిఆర్ తన మాటల ద్వారా, తన ప్రకటన ద్వారా ముందస్తు ఎన్నికలకు సంకేతాలు ఇవ్వకనే ఇచ్చేస్తారని  చెప్పుకుంటున్నారు. ఉన్నట్టుండి అనుకోకుండా ఢిల్లీ బయలుదేరుతారు. ప్రధాని,మంత్రుల అపాయింట్మెంట్ కోరుతారు. ఈ ఏడేళ్లలో సాధించిన ప్రగతిని వివరిస్తుంటారు. కేంద్రాన్ని టార్గెట్ చేస్తారు, పిఎంను కార్నర్ చేస్తారు. పామ్ హౌస్ వేదికగా కేసీఆర్ ముందస్తు మేధోమధనం ఉన్నతాధికారులతో అంతర్గత సమావేశాలు, మంతనాలు చకచకా ముందస్తుకు పావులు కదుపుతున్నారా..? ఒకవేళ ముందు సమరానికి సిద్ధం అయితే కేసీఆర్ ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేస్తారు.


 తెలంగాణలో హ్యాట్రిక్ విజయం నమోదు చేసేందుకు ఎమ్మెల్యేల టికెట్ విషయంలో సీఎం కేసీఆర్ ఈసారి సరికొత్తగా ముందుకు వెళ్ళోచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీతో సంబంధం లేకుండా ఆ నియోజకవర్గాల్లో వ్యక్తిగతంగా ఎమ్మెల్యే పై ఉన్న వ్యతిరేకత టిఆర్ఎస్ పై పడకుండా ఉండేందుకు సిట్టింగ్స్ కు ఈసారి నో ఛాన్స్ చెప్పే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈసారి 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం ఇచ్చి అదృష్టం పరీక్షించుకునేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. 2014, 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఆ తర్వాత ఏడాది లోక్ సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. అదిగాక దుబ్బాక ఆ తర్వాత, గ్రేటర్ హైదరాబాద్, హుజురాబాద్ ఫలితాలతో ఉక్కిరి బిక్కిరయిన అధినేత ఎలాగైనా ముచ్చటగా మూడోసారి తాను అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్నారని, అందుకే ముందస్తు వ్యూహాన్ని ఎంచుకున్నారని టాక్ వినిపిస్తోంది.


సంక్షేమ పథకాల పై ప్రత్యేకమైన దృష్టి పెట్టడమే ఇందుకు కారణమని గులాబీ నేతలు చెబుతున్నారు. నిజానికి వరుసగా రెండు ఎన్నికల్లోనూ కేసీఆర్ కు ప్రత్యర్థి పార్టీల నుంచి పెద్దగా పోటీ లేదు. కానీ ఈసారి బిజెపి తరపున బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి రూపంలో చిక్కులు ఎదుర్కోక తప్పదంటున్నారు  పరిశీలకులు. మూడు నెలల తర్వాత 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని, వచ్చే బడ్జెట్ లో దళిత బందు కోసం 20 వేల కోట్లు కేటాయిస్తామని కేసీఆర్ తాజాగా ప్రకటించారు. వచ్చే ఏడాదిలో ముందస్తుకు వెళ్లాలనుకుంటున్న కేసీఆర్ సరిగ్గా ఆ సమయానికి కలిసొచ్చేలా ఈ ప్రకటనలు చేశారన్న విశ్లేషణలు ఉన్నాయి. బిజెపి నామమాత్రపు పోటీకే పరిమితమైతే, కాంగ్రెస్ కొన్ని చోట్ల పేరున్న నాయకులను నిలబెట్టే ప్రయత్నం చేయకపోతే కెసిఆర్ గెలుపు ఈజీనే. మరి అది సాధ్యం అవుతుందా, లేదా..అయితే దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందో కాలమే సమాధానం చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: