తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. కరోనా కేసులకు వైద్యం కోసం.. అదనపు పడకలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని.. కరోనా థర్డ్ వేవ్ వచ్చిన తట్టుకొనే విధముగా 1400 పడకలు హైద్రాబాద్ లో ఏర్పాటు చేయమన్నారని పేర్కొన్నారు. నిలోఫర్ లో 800 పడకలు ఏర్పాటు చేస్తున్నామని.. మరో 6 ఆసుపత్రిలో 100 పడకలు చొప్పున ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అందులో భాగంగా వనస్థలిపురం లో 100 పడకలు ఏర్పటు చేసుకున్నామని.. అందరూ కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి ,ప్రభుత్వానికి సహకరించాలని చెప్పారు వైద్య శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు .
24 లక్షలు హోమ్ ఐసోలాషన్ కిట్లను అందుబాటులో ఉంచుకున్నామని.. పేదల వైద్యం మీదా ఎక్కువ ఖర్చు పెడుతున్నా రాష్ట్రము తెలంగాణ అని కేంద్రం ప్రకటన చేసిందన్నారు. పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ఇచ్చారని.. ఫ్రూట్ మార్కెట్ వద్ద 1000 పడకల సూపర్ స్పెషలాటి ఆసుపత్రి రానున్నదని ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని.. మన బస్తి ధవాఖాన్ లో దేశానికి ఆదర్శమన్నారు వైద్య శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు . నగరం లో ఎక్కడ ఇంకా ఎక్కువ అవసరం ఉన్న ప్రాంతంలో మరిన్ని బస్తి దవాఖాన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించామని అదేశలు ఇచ్చారని.. మున్సిపాలిటీలో కూడా బస్తి దవాఖాన్ లో ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. కోవిడ్ దృష్టి లో పెట్టుకొని అదనంగా వైద్యలను ఇక్కడ ఏర్పాటు చేసామని.. 2 డోస్ లు కోవిడ్ వాక్సిన్ అందరూ తీసుకోవాలని పేర్కొన్నారు. టీకా సురక్షితమని.. కొంచం వ్యాధి లక్షణాలు ఉన్న పరీక్షలు చేసుకోవాలన్నారు. ఓమిక్రాన్ వ్యాప్తి ఎక్కువ తీవ్రత తక్కువగా ఉందని పేర్కొన్నారు వైద్య శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు .