అంబానీ చదివిన పుస్తకాలివిగో.. మీరూ చదువుతారా..?
కొవిడ్‌తో పాటు ప్రపంచాన్ని భయపట్టిన మరికొన్ని వైరస్‌ల వ్యాప్తి.. సంక్షోభ సమయాల్లో ఏం జరిగింది.. అనే అంశాలను వివరిస్తూ ఈ పుస్తకం ఉంటుందట. నిలకడలేనిప్రజల జీవనశైలి, బలహీన ప్రభుత్వాల వల్ల ఎలాంటి సంక్షోభాలు ఏర్పడతాయో ఈ పుస్తకంలో వివరించారట. సమర్థ నాయకత్వం, జీవనశైలిలో మార్పుల వల్ల ఎంతో లాభం ఉంటుందని ఈ పుస్తకం చెబుతుందట.
అంబానీ సూచిస్తున్న మరో పుస్తకం.. రే డాలియో రాసిన ప్రిన్సిపల్స్ ఫర్ డీలింగ్ విత్ ది చేంజింగ్ వరల్డ్ ఆర్డర్: వై నేషన్స్ సక్సీడ్ అండ్ ఫెయిల్’. ఈ పుస్తకం గత 500 ఏళ్లలో ప్రపంచంలో జరిగిన గొప్ప రాజకీయ, ఆర్థిక విజయాలు, పరాజయాలపై రాసిన పుస్తకమట. ప్రస్తుతంఉన్న కఠిన సమయం కంటే రాబోయే కాలం ఎలా భిన్నంగా ఉంటుందో ఈ పుస్తకం చెప్పిందట. పాలకులు, వ్యాపారవేత్తలు, అధికారులు, యువత ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాలంటున్నారు అంబానీ.
ఆయన సూచిస్తున్న మరో పుస్తకం అలెక్ రాస్ రాసిన ది ర్యాగింగ్ 2020ఎస్: కంపెనీస్, కంట్రీస్, పీపుల్ - అండ్ ది ఫైట్ ఫర్ అవర్ ఫ్యూచర్. కార్పొరేట్ వ్యవహారాలు, ప్రభుత్వాల పనితీరు, ప్రపంచ వ్యాప్త వినూత్న ఆర్థిక, రాజకీయ నమూనాల గురించి ఈ బుక్ చెబుతుందట. ఇవే కాకుండా మౌరో గిల్లెన్ రాసిన 2030: హౌ టుడేస్ బిగ్గెస్ట్ ట్రెండ్స్ విల్ కొల్లైడ్ అండ్ రీషేప్ ది ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీథింగ్, జోస్ లింకర్ రాసిన బిగ్ లిటిల్ బ్రేక్‌థ్రూస్: హౌ స్మాల్, ఎవ్రీడే ఇన్నోవేషన్స్ డ్రైవ్ ఓవరైజ్డ్ రిజల్ట్స్ అనే పుస్తకాలు కూడా చదవాలని అంబానీ సూచిస్తున్నారు. మరి చదువుతారా..?