ఒమిక్రాన్: రెండు డోసులు తీసుకున్నా డోంట్ కేర్?
కొన్ని పరిశోధనల అనంతరం ఈ విషయంపై ఒక అంచనాకు వచ్చిన శాస్త్రవేత్తలు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైతం ఈ కొత్త వేరియంట్ సోకుతుందని వారిపై ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. ఇక ఈ కొత్త వైరస్ డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని పరిశోధనలు ద్వారా అర్థమయ్యింది అని నిపుణులు అంటున్నారు. ఇక ఈ కొత్త వేరియంట్ కు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న టీకా సామర్థ్యాలను అధిగమించి ప్రభావం చూపే సామర్థ్యం ఉండే అవకాశం ఉన్నదని వివరించారు. దాంతో రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారు సైతం ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.
తాజాగా.. ఒమిక్రాన్ ప్రభలుతున్న నేపథ్యంలో కేంద్రం కూడా ఇలా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మన దేశంలో ఇప్పటి వరకు ఈ కొత్త వేరియంట్ బారిన పడ్డ 183 కేసులపై చేసిన అధ్యయనం ద్వారా కేంద్రం వివరాలను వెల్లడించింది. ఈ వివరాలు ప్రకారం ప్రకారం, ఒమిక్రాన్ బారిన పడ్డ ప్రతి పది మందిలో తొమ్మిది మంది రెండు డోసుల టీకాలు వేసుకున్నవారే కావడం గమనార్హం. కాబట్టి ఒమిక్రాన్ ను ఎదుర్కోవాలి అంటే వ్యాక్సిన్ తో పాటుగా నిబంధనలకు పాటించడం కూడా ముఖ్యమే అంటున్నారు.