మోడీ ఒకలా.. కేంద్రమంత్రి మరోలా.. అయ్యో ఏదీ నమ్మాలి?
కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ సాగు చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకూ తమ ఉద్యమాన్ని విరమించేది లేదు అంటూ తేల్చి చెప్పారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించి ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. వ్యవసాయ సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇక రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేపడుతున్న రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయ్. ఇక ఇటీవలే ఉద్యమాన్ని విరమించాయి అన్న విషయం తెలిసిందే..
అయితే కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేసినట్లేనా అయినా లేక మళ్లీ ఏదైనా ట్విస్ట్ ఇస్తూ సాగు చట్టాలను అమలులోకి తీసుకు వస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయ్. స్వల్ప మార్పులతో సాగు చట్టాలను మళ్లీ అమలులోకి తీసుకు వస్తాము అంటూ ఆయన చెప్పుకొచ్చారు.. రైతుల అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ ఎంతో చేశారు అంటూ వ్యాఖ్యానించారు. మోడీ ఎవరూ చేయని పని చేసి చూపించారని చెప్పుకొచ్చారు నరేంద్ర సింగ్ తోమర్. కాగా వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకు వస్తాము అంటూ కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు కాస్త కొత్త చర్చకు దారితీశాయి.