టీమిండియా మాజీ క్రికెటర్, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుదీర్ఘకాలం పాటు టీమిండియాకు తన వంతు సహాయం చేసి జట్టును ఎన్నో సార్లు విజయ తీరాలకు చేర్చాడు హర్భజన్ సింగ్. అయితే రెండు రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. అయితే ఆయన క్రికెట్ కు వీడ్కోలు పలకడంతో రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. హర్భజన్ సింగ్.. పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. అందుకే 23ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికా డ ని.. అ టు క్రి కెట్, ఇటు పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది పంజాబ్‌లో జరిగే ఎన్నికల్లో.. హర్భజన్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు అతని సన్నిహితులు.
అయితే హర్భజన్ మాత్రం.. తాను ఆచితూచి ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. ఇటీవల హర్భజన్.. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో భేటీ అయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను సిద్ధూ తన సోషల్ మీడియా లో షేర్ చేస్తూ..సాధ్యమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి అని రాసుకొచ్చారు. దీంతో కాంగ్రెస్‌లో భజ్జీ చేరిక ఖాయమనే వార్తలు వినిపించాయి. తనకు పొలిటికల్ ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయని.. తాను ఈ రంగంలో రాణించగలనని అనుకున్నప్పుడే.. ఫీల్డ్‌లోకి దిగుతానంటున్నాడు టర్బోనేటర్.
ఇటీవల హర్భజన్ బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చినప్పుడు భజ్జీ వాటిని ఖండించాడు. ఇప్పుడు కాంగ్రెస్‌తో మీటింగ్ విషయాన్ని మాత్రం అతను ఖండించలేదు. దీనినిబట్టి అతను హస్తం పార్టీ తరఫున బరిలో దిగుతాడనే ప్రచారం జరుగుతోంది. భజ్జీ స్వస్థలం జలంధర్. ఇక్కడ ఎస్సీ ఓటర్లు ఎక్కువ. ప్రస్తుతం అక్కడ బలంగా ఉన్న శిరోమణి అకాలీదళ్.. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. దీంతో ఈ కూటమిని ఎదుర్కొనేందుకు భజ్జీని రంగంలోకి దింపాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది.