మూడో డోసు ఇచ్చేదానిపై నిపుణుల అభిప్రాయం ఇదీ..!

NAGARJUNA NAKKA
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కారణంగా 60ఏళ్లు దాటిన వృద్ధులకు, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి మూడో డోసు ఇస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. అయితే ఈ డోసు ఎప్పుడిస్తారనేదానిపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో ప్రికాషన్ డోసుకు రెండో డోసు తీసుకున్న తర్వాత 9 నుంచి 12 నెలల మధ్య ఇచ్చే అవకాశముందని నిపుణులు అంటున్నారు. దీనిపై చర్చలు జరుగుతుండగా.. త్వరలోనే క్లారిటీ రానుంది.

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన ఒక నెలలోనే 108దేశాలకు వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా 1.5లక్షలకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. నవంబర్ 24న మొదటి ఒమిక్రాన్ కేసు సౌత్ ఆఫ్రికాలో వెలుగు చూసింది. ఇదిలా ఉండగా.. భారత్ లో తొలి ఒమిక్రాన్ కేసు డిసెంబర్ లో బయటపడింది. ఆ తర్వాత కేవలం 22రోజుల్లో 17 రాష్ట్రాలకు వ్యాపించింది.

ఇక అమెరికా, యూకేలో కేసుల పెరుగుదలకు డెల్మిక్రాన్ అనే సూపర్ స్ట్రెయిన్ కారణమని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లలోని స్పైక్ ప్రోటీన్ లు కలిస్తే డెల్మిక్రాన్ ఏర్పడుతుందని చెబుతున్నారు. ఒక వ్యక్తికి డెల్టా, ఒమిక్రాన్ సోకితే డెల్మిక్రాన్ ఉద్బవించే అవకాశముందన్నారు. ఇది సోకితే ఆగకుండా దగ్గు, తీవ్రంగా జ్వరం, వాసన కోల్పోవడం లాంటి లక్షణాలు రోగుల్లో కనిపిస్తాయని తెలిపారు.

మరోవైపు ఏపీలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా, యూకే నుంచి వచ్చిన ప్రకాశం, అనంతపురం జిల్లా వాసులకు ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 6కి చేరింది. ఇదిలా ఉండగా.. విదేశాల నుంచి 67మంది రాష్ట్రానికి వచ్చారు. వారిలో 12మందికి కరోనా సోకినట్టు తేలింది. మొత్తానికి బూస్టర్ డోస్ విషయంలో వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ఒక అంచనాకైతే వచ్చేస్తున్నారు. ఎప్పుడిస్తే బాగుంటుందో చర్చలు జరుపుతున్నారు.









మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: